‘హృతిక్’పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ‘కంగనా’

Kangana Ranaut Comments On Hrithik Roshanబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ – కంగనా రనౌత్ మధ్య రేగిన వివాదం గురించి అందరూ మర్చిపోయినా… ముద్దుగుమ్మ కంగనా మాత్రం ఇప్పట్లో వదిలేలా లేదు. ఇప్పటికే ఆ వివాదంపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండేలా చేస్తున్న కంగనా… తాజాగా మరోసారి జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తనతో రేగిన వివాదంలో జోక్యం చేసుకుని, మరోసారి ఆమెకు అవకాశం ఇవ్వవద్దంటూ బాలీవుడ్ లో అందరి వద్దకు వెళ్లి హృతిక్ రోషన్ ఏడ్చేవాడని తెలిపింది. అతనితో మాట్లాడిన తరువాత వాళ్లంతా ఫోన్ చేసి తనను నిజమా? అని అడిగేవారని పేర్కొంది. తాను మాత్రం అలాంటి వాళ్లకి పని చూసుకొమ్మని చెప్పేదానిని, అంతే కాదని పలు మార్లు తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, ఈ బెదిరింపులతో తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందేవారని చెప్పింది.

ADVERTISEMENT

తన గురించి అందరి ముందు చెబుతామని బెదిరించే వాళ్లని, అలాంటి వాళ్లు తనపై పన్నిన కుట్రలన్నీ తనకు తెలుసని చెప్పింది. అందుకే తాను ధైర్యంగా ఉన్నానని తెలిపింది. హృతిక్‌ పట్టించుకోకపోవడంతో కంగనా ఇలా ప్రతి ఇంటర్వ్యూలో అతని గురించి మాట్లాడుతోందని, హృతిక్‌ పై ఆమెకి ఇంకా ప్రేమ తగ్గలేదని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories