మరో బయోపిక్… హీరోయిన్ వెయిటింగ్..!

Kangana Ranaut's Meena Kumari biopic బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ తరహా చిత్రాలకు ఆదరణ పెరుగుతూ ఉండటం ఇందుకు కారణం. అలనాటి అందాల కథానాయిక మీనాకుమారి బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గ్లామర్ పరంగా .. నటన పరంగా మీనాకుమారికి లభించిన కీర్తి ప్రతిష్ఠలు ఎనలేనివి. ఆమె కెరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు .. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కనిపిస్తాయి.

ADVERTISEMENT

అలాంటి ఆమె బయోపిక్ ను తెరకెక్కించడానికి కొంతకాలం క్రితమే రంగంలోకి దిగారు. ప్రధాన పాత్రకి గాను కంగనా రనౌత్ ను ఎంచుకున్నారు. అయితే ఆమె ఎంపిక పట్ల మీనా కుమారి సోదరుడు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. దాంతో అప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు పోలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలయ్యాయి. మీనాకుమారి పాత్రకి గాను విద్యాబాలన్ ను సంప్రదిస్తున్నారట. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉందని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories