ఆయా రామ్ గయా రామ్ లను నమ్మి రాజకీయం చేస్తే ఇంతే మోడీ గారూ!

Kanna Lakshminarayana may quit BJPవెల్లంపల్లి శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి వంటి వారిని పక్క పార్టీల నుండి చేర్చుకుని దక్షిణాదిన అతిపెద్ద ఎన్డీఏ పార్టీ ఐన టీడీపీని వారితో పొడస్తమానూ తిట్టించి బయటకు వెళ్లిపోయేలా చేశారు బీజేపీ వారు. ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ వైకాపా కండువా కప్పుకుని ఆ పార్టీ టిక్కెట్టు కూడా కంఫర్మ్ చేసుకున్నారు.

ADVERTISEMENT

మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ సైతం ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కార్యకర్తల సమావేశం కూడా పెట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జగన్ సమక్షంలో ఆయన వైకాపాలో చేరడం ఇక లాంఛనమే అని తెలుస్తుంది. ఒకప్పుడు ఎవరైతే నేతలు తమ బలమని బీజేపీ భావించిందో ఇప్పుడు వారే చెయ్యాల్సింది అంతా చేసి ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు.

బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించాక మరిన్ని వలసలు ఉండొచ్చు. దీని వల్లే ఆ విషయాన్నీ కొంత నాన్చుతున్నట్టు కనిపిస్తుంది. దీని నుండి పాటలు నేర్చుకోవడం ఆ పార్టీకి ఎంతైనా మంచిది. ఆయా రామ్ గయా రామ్ లను నమ్మి రాజకీయం చేస్తే ఇంతే మోడీ గారూ! ఇప్పుడు కాదు అని అనగలరా?

ADVERTISEMENT
Latest Stories