టీజర్ టాక్ – క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది!

Karam Dosa Teaser Review Talk Trivikram Movie నటీనటులు ఎంత కొత్త వారైనా సరికొత్త ట్రీట్మెంట్ తో వస్తే ప్రేక్షకులు ఏ విధంగా ఆశీర్వదిస్తారో ‘పెళ్లి చూపులు’ సినిమా నిరూపించింది. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుండి ప్రేక్షకులలో ఒక పాజిటివ్ మార్క్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా అలాంటి అనుభూతినే మరో చిన్న సినిమా ప్రేక్షకులకు కలిగిస్తోంది. “కారందోస” పేరుతో సిద్ధమవుతోన్న సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అప్ కమింగ్ నటీనటులతో వస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ ను పంచుతోంది. త్రివిక్రమ్ జి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ క్లైమాక్స్ లో ‘ఇది కధకు ఒక వైపు మాత్రమే’ అన్న ట్విస్ట్ ఇచ్చి మరింత ఆసక్తి పెంచారు. టీజర్ కు తగిన విధంగా దేవ్ గురు అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరియు క్యాచీగా ఉండే డైలాగ్స్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందు రానున్న ఈ సినిమా టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories