‘స్వలింగ’ వివాహాన్ని పోస్ట్ చేసిన ‘హీరోయిన్’

Karthik-and-Sandeep indian Gay Marriage in USA‘బుజ్జిగాడు’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ సంజన, ఇటీవల ‘దండుపాల్యం 2’ సినిమాలో లీక్ అయిన న్యూడ్ సీన్స్ ద్వారా విపరీతమైన ప్రచారాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అవి న్యూడ్ సీన్స్ కావన్న విషయం బయట పడినప్పటికీ, సంజన పేరు మాత్రం మీడియా వర్గాల్లో మారుమ్రోగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ సంచలన వీడియోను పోస్ట్ చేసి, త్వరలో ఇండియా కూడా ఇలాంటి వివాహాలకు వేదిక అవుతుందా? వీటికి కూడా మనం సాక్షులుగా నిలుస్తామా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ADVERTISEMENT

“అమెరికాలో బాగా సెటిల్ అయిన ఇద్దరు మగవాళ్ళు అంగరంగ వైభవంగా వివాహాం చేసుకున్న వీడియోను పోస్ట్ చేసి… అమెరికాలో జరిగిన ఇదే ఇండియా భవిష్యత్తా..?” అంటూ ప్రశ్నించింది. అయితే ఇందులో రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి ‘గే’ సంస్కృతి పెరిగిపోతుందన్న ఆవేదన కాగా, మరొకటి ఇండియాలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల ఆక్రందన. రోజు రోజుకు మహిళలపై పెచ్చుమీరుతున్న అఘాయిత్యాలతో, చివరికి ఇండియాలో మగవాళ్ళు మగవాళ్ళే పెళ్లి చేసుకునే దుస్థితి ఏర్పడుతుందన్నది సంజన భావన కావచ్చు.

ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుశా ఆడ – మగ వివాహం కూడా ఇంత గ్రాండ్ గా జరుపుకోరేమో గానీ, ఈ ‘గే’ వివాహాం అత్యద్భుతంగా జరిగిందని ఈ వీడియో చెప్పకనే చెప్తోంది. ఇద్దరు కుటుంబ తల్లితండ్రులు వీరిని ఆశీర్వదించడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. మరి సంజన చెప్పింది జరుగుతుందో లేదో గానీ చట్టపరంగా అయితే అంతకుముందు ఉన్న ఇబ్బందులను సుప్రీంకోర్టు సడలించిన విషయం తెలిసిందే.

Upper Class indian Gay Marriage in US. Is this the future of India , will we witness it here as well ?

A post shared by Sanjjanaa Galrani (@actressanjjanaa) on

ADVERTISEMENT
Latest Stories