ఆర్జే బాలాజీ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది

karuppu-telugu-response

13 ఏళ్ల తర్వాత సూర్యకి లభించిన సక్సెస్ గా తమిళనాట మంచి పేరు తెచ్చుకున్న “కరుప్పు” తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ఇక్కడ బుకింగ్స్ కూడా అంత ఆసక్తికరంగా లేవు. అయితే.. సినిమా చూసినవాళ్ళందరూ కామన్ గా చెప్తున్న ఒకే ఒక్క మైనస్ ఆర్జే బాలాజీ క్యారెక్టర్.

బేబీ కన్నన్/కృష్ణన్ అనే పాత్రలో ఆర్జే బాలాజీ కాకుండా ఎస్.జే.సూర్య లేదా పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి నటులెవరైనా నటించి ఉంటే అదిరిపోయేదని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. సూర్య ముందు ఆర్జే బాలాజీ అస్సలు అనలేదు. దేవుడ్ని సైతం ఎదిరించే పాత్రలో ఆర్జే బాలాజీ తేలిపోయాడు. అలాగే.. ఆర్జే బాలాజీ స్వయంగా రాసుకున్న ఎలివేషన్స్ కి తన స్క్రీన్ ప్రెజన్స్ తో న్యాయం చేయలేకపోయాడు కూడా.

ADVERTISEMENT

తమిళనాట మంచి కలెక్షన్స్ సాధిస్తున్న “కరుప్పు”.. తెలుగులో మాత్రం తేరుకోవాల్సి ఉంది. తెలుగునాట అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా తెలుగు స్టార్స్ అందరూ ట్వీట్స్ వేసి సినిమాని ఎంకరేజ్ చేసినా.. ఎందుకో మూమెంటం లేదు బుకింగ్స్ లో.

“సింగం 2” తర్వాత సూర్య సినిమాకి ఈ స్థాయి పాజిటివ్ టాక్ వచ్చి 13 ఏళ్లవుతుంది. ఈ టాక్ ను కలెక్షన్స్ గా మార్చుకోవాల్సిన బాధ్యత సూర్య మీద కూడా ఉంది. కాస్త థియేటర్ విజిట్స్ లేదా ఇంటర్వ్యూలతో సినిమాని ప్రమోట్ చేస్తే బెటర్. క్యాస్టింగ్ & యాక్టింగ్ విషయంలో చాలా తప్పులు చేసినా ఆర్జే బాలాజీ.. కనీసం ప్రమోషన్ విషయంలోనైనా దూకుడు ప్రదర్శిస్తాడేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories