“కాటమరాయుడు”తో స్పెషల్ ఎంట్రీ!

Katamarayudu Teaser With Nikhil Kesavaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “కాటమరాయుడు” సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పరాజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో, పవన్ అభిమానులు ‘కాటమరాయుడు’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాపై ఒక్క పవన్ అభిమానులే కాదు, యువ హీరో నిఖిల్ కూడా అంతకు మించిన అంచనాలనే పెట్టుకున్నాడు. ఎందుకంటే… బాక్సాఫీస్ వద్ద పవన్ సినిమా క్లిక్ అయితే, తన కొత్త సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ దొరికినట్లే!

ఫస్ట్ లుక్ తోనే అందరినీ పడేసిన నిఖిల్ తాజా చిత్రం “కేశవ” సినిమాకు సంబంధించిన టీజర్ ను పవన్ ‘కాటమరాయుడు’ సినిమాతో పాటు సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని హీరో నిఖిల్ స్వయంగా వెల్లడించాడు. పవన్ సినిమాతో పాటు వస్తున్న టీజర్ కావడంతో, సహజంగానే దీనిపై అందరి చూపులు పడతాయి. ఒకవేళ టీజర్ తో మెప్పించగలిగితే, ‘కేశవ’ సినిమా ఓపెనింగ్స్ కు డోకా ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

ఇప్పటికే ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న నిఖిల్ కు పవన్ ప్రభంజనం కూడా తోడయితే, మరో మెట్టు ఎదిగే అవకాశం ఉంటుంది. “కాటమరాయుడు” సినిమాతో పాటు స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్న “కేశవ” టీజర్, ఆన్ లైన్ లో మాత్రం మంగళవారం నుండే అందుబాటులో ఉండనుంది. అయితే యూ ట్యూబ్ లో పబ్లిసిటీతో పోలిస్తే… ధియేటర్ లో వచ్చే మౌత్ టాక్ మరింత కిక్ ఇస్తుంది కదా! ఆ కిక్ కోసమే పవన్ తో పాటు ఎంట్రీ ఇవ్వనున్నాడు నిఖిల్!

ADVERTISEMENT
Latest Stories