ఫస్ట్ లుక్ – ‘వాలైంటైన్స్ డే’ పోస్టరా ఇది?

Kathalo-Rajakumari-first-look-poster-talkవిలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ నారా రోహిత్. జయాపజయాలతో సంబంధం లేకుండా వైరైటీ పాత్రలను పోషిస్తున్న నారా రోహిత్, త్వరలో “కథలో రాజకుమారి” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు. ఊర మాస్ లుక్ లో సరికొత్తగా నారా రోహిత్ కనిపిస్తున్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.

గడ్డం పెంచుకుని, సిగరెట్ తాగుతూ, కత్తి పట్టుకుని గళ్ళ లుంగీలో కనపడుతున్న నారా రోహిత్ లుక్ తమిళ హీరో మాదిరి ఊర మాస్ కు నిదర్శనంగా ఉందని చెప్పవచ్చు. లుక్ పరంగా డిఫరెంట్ రేంజ్ లోనే ఉన్నప్పటికీ, ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని, ఇంత మాస్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం అనేది ట్విస్టే. అయితే ‘లవ్ ఇన్ ఇట్స్ బెస్ట్ ఫాం’ అనే క్యాప్షన్ తో సినిమా కధను ఏంటో చెప్పకనే చెప్పింది చిత్ర యూనిట్.

ADVERTISEMENT

కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ మలయాళ హీరోయిన్ నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు లక్ష్మి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ళ భరణి, అజయ్, ప్రభాస్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనపడుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT
Latest Stories