వర్మను పడేసిన కత్తి!

Kathi-Mahesh---Ram-Gopal-Varma-Twitterవర్మ విడుదల చేసిన “గాడ్, సెక్స్, ట్రూత్” ట్రైలర్ కు రివ్యూ అందించిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ట్విట్టర్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు. “మియా ఒక దేహం కాదు, కొన్ని యుగాలుగా అణిచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా వర్మ చెప్పిన గొంతుకే” ఈ సినిమాగా అభిప్రాయపడ్డ కత్తి, ఈ నెల 26న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ ట్వీట్ కు ఫిదా అయిన వర్మ, సదరు మాటలకు గానూ కత్తి మహేష్ ను అభినందిస్తూ రిప్లై ఇచ్చాడు.

హే మహేష్… ‘గాడ్, సెక్స్, ట్రూత్’లోని అంతర్గత కోణాలను విశ్లేషనాత్మకంగా నువ్వు బాగా అర్ధం చేసుకున్నందుకు చాలా థ్రిల్ గా ఉందని, మియా మాటలు నిజంగా స్త్రీ స్వేఛ్చకు నిదర్శనమని, మీ పరిశీలన అద్భుతమని” కత్తి మహేష్ ను కొనియాడుతూ ట్వీట్ చేసారు. వర్మ యొక్క ఉద్దేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని కత్తి మహేష్ అక్షర రూపంలో పెట్టడంతో, ఈ సంచలన దర్శకుడు ఫిదా అయినట్లుగా చెప్పొచ్చు. తన విశ్లేషణతో వర్మను పడేసిన కత్తి, భవిష్యత్తులో ఏమైనా అవసరం వస్తే వర్మ సలహా కోరతారేమో చూడాలి.!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories