కవిత రాజకీయం ‘నిప్పుల్ల’ గుండమేనా ఇక..

Kavitha Flex Burned After BRS Suspension Shock

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో కవిత రేపిన అవినీతి చిచ్చు ఆమె ‘ఫ్లెక్సీ’ దహనం వరకు వచ్చింది. సొంత పార్టీ కార్యకర్తలే కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హరీష్ రావు పై ఆమె వేసిన అవినీతి మరకలు గాను నిరశనగా కవిత ఫ్లెక్సీ ని తగలబెట్టారు గులాబీ సేనలు.

అయితే కేసీఆర్ కళ్ళ ముందే ఈ తంతులు మొత్తం జరగడం, అటు కవిత సొంత పార్టీ నేతల పై అవినీతి ఆరోపణలు చేస్తూ, పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే స్థాయికి వెళ్లడం దానికి ప్రతిగా బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ వేటు రావడం, పార్టీ శ్రేణుల నుంచి కవిత కు వ్యతిరేకంగా నిరశన జ్వాలలు రేగడం ఇవన్నీ కేసీఆర్ ను మానసికంగా మరింత కుంగతీసే అంశాలుగా మారతాయి.

ADVERTISEMENT

అయితే కేసీఆర్ మౌనం కానీ ఆయన సహనం కానీ కవిత దూకుడుని నిలువరించలేకపోవడంతో ఎట్టకేలకు కవితను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ ప్రకటన వచ్చి రాగానే బిఆర్ఎస్ శ్రేణులు ఇక కవిత మీద రెచ్చిపోతున్నారు.

ఇన్నాళ్లు పార్టీ అధినేత కేసీఆర్ సహనం కవితను బిఆర్ఎస్ నుంచి కాపాడగలిగింది కానీ ఒక్కసారి కవితకు గులాబీ జెండా తో సంబంధం తెగతెంపులు కాగానే కవిత ఫ్లెక్సీ లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఆమె పై విమర్శల జడివాన విస్తృతమవుతుంది.

నాడు బిఆర్ఎస్ కు ప్రాణం పోసిన కాళేశ్వరం ఇప్పుడు అదే బిఆర్ఎస్ జీవం తీస్తుంది. అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా కాళేశ్వరం కొట్టిన దెబ్బకు కల్వకుంట్ల రెండు ముక్కలయింది. బిఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.

దీనితో ఇక నుంచి కవితకు కల్వకుంట్ల అనే బ్రాండ్ మార్క్ రక్షణ కవచం ఉండకపోవచ్చు, బిఆర్ఎస్ అనే వాసతైనా రాజకీయ ప్రయాణం కొనసాగకపోవచ్చు. కేసీఆర్ ను కాదని, బిఆర్ఎస్ ను వద్దనుకుని కవిత తెలంగాణ రాజకీయాలలో ఎదగడం అంత ఆషామాష విషయం కాదు.

పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే కవిత ఫోటోలను తగలబెట్టే స్థాయికి వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవితకు వ్యతిరేకంగా గళం విప్పితే కవిత రాజకీయం నిప్పుల సుడిగుండంగా మారడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories