తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనతో తెరాస ను బిఆర్ఎస్ గా రూపాంతరం చేసి తన రాజకీయాన్ని ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి కి తీసుకెళ్లాలని భావించారు.
దీనితో తెలంగాణలో ప్రాంతీయవాద రాజకీయానికి భర్తీ ఏర్పడింది అనుకున్న సందర్భంలో బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వేటుతో బయటకు రావడం, జాగృతి పేరు మీద కవిత సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
అయితే కవిత తెలంగాణ పేరు ప్రతిబించేలా తన కొత్త పార్టీ పేరును త్వరలోనే ప్రకటిస్తానని, ఆ పార్టీ రాజకీయంతోనే తానూ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని అందుకుంటానని ఆశాభావం వ్యక్తపరుసున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉగాది రోజున “తెలంగాణ ప్రజా జాగృతి” పేరు అనూహ్యంగా తెరమీదకొచ్చింది.
కవిత స్థాపించబోతున్న కొత్త పార్టీ TPJ నే అని ఇందు కోసం ఆమె ఇప్పటికే పార్టీ పేరు రిజిస్టర్ వంటి కార్యక్రమాలు చేపట్టారని, అయితే అందులో కొన్ని సాంకేతిక అడ్డంకులు రావడంతో ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారని వార్తలు గుప్పుమన్నాయి.
అయితే తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన “తెలంగాణ రాష్ట్ర సమితి” పార్టీకి ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్న “తెలంగాణ ప్రజా జాగృతి” ప్రత్యామ్నాయం కానుందా.? తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం పోరాడిన, ఉద్యమించిన తెరాస ఇప్పుడు బిఆర్ఎస్ గా మారిపోవడంతో తెలంగాణ ప్రజలు తమ ఉనికిని ప్రతిబింబించే పార్టీ కోసం ఎదురు చుస్తున్నారా.?
ఆ ఎదురు చూపులకు కవిత TPJ అద్దం పెట్టబోతోందా.? అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ పేరుతో పుట్టే రాజకీయ పార్టీ అవసరం ఉందా.? బిఆర్ఎస్ ఆ అవసరాలను సంతృప్తి పరచలేకపోతుందా.? TRS తో ఏపీ – తెలంగాణ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయితే TPJ తో కల్వకుంట్ల కుటుంబం రెండుగా చీలనుంది.




