గులాబీ దండులో గుబులు… కవిత స్ట్రాంగ్ సిగ్నల్!

Kavitha’s Political Moves Stir Debate in BRS Camp

ఈ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత సింహంతో దోస్తీ చేస్తే, అది వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్న 8 మందిని ఎత్తుకుపోయింది.

తామందరం ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ సభ్యులమని జాగృతితో మాకు సంబంధమే లేదని చెప్పి వారు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు. తమ మొదటి సినిమా క్లైమాక్స్ ఇలా ఉంటుందని ఆమె కూడా ఊహించి ఉండరు.

ADVERTISEMENT

కానీ పార్టీ పెట్టక మునుపే మరో కొత్త పాఠం నేర్చుకున్నందుకు సంతోషపడవచ్చు.

అంతేకాదు బీఆర్ఎస్‌ పార్టీకి నష్టం కలిగింఛి ప్రతీకారం తీర్చుకున్నందుకు కలిగే సంతోషం వేరు.

అయితే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. ఇకపై కొట్టబోయే దెబ్బలకు బీఆర్ఎస్‌ గోడలు బీటలు వారవచ్చు.

ఆమె కేటీఆర్‌, హరీష్‌ నాయకత్వంపై గులాబీ దండులో పునరాలోచన చేయించగలిగితే చాలు.. ఈక్వేషన్స్ మారవచ్చు. లేదా ఆమెనే గూటికి తెచ్చుకొని హరీష్‌ని సిద్ధిపేటకి పరిమితం చేయవచ్చు.

ADVERTISEMENT
Latest Stories