కవిత ప్రాంతీయవాద రాజకీయం…’జెన్ జీ’ లు గుర్తించడం లేదా.?

Kavitha Regional Politics

తెరాస 2.0 అంటూ నాటి తెరాస ప్రాంతీయ భావజాలాన్ని నేటి తరం పై రుద్దే ప్రయత్నం చేస్తున్న కవిత రాజకీయాన్ని తెలంగాణ సమాజం గుర్తించడం లేదా.? ప్రొద్దున్న లేస్తే చాలు ఆంధ్రా – తెలంగాణ అంటూ మైకు పట్టుకుని రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టే కవిత రాజకీయం తెలంగాణ ప్రజలకు విసుగు తెప్పిస్తుందా.?

కవిత భావజాలం కు మద్దతుగా తెలంగాణ లో ఏ ఒక్కరు అడుగు ముందుకేయడం లేదు. తెలంగాణలో చదువుకునే ఆంధ్రా విద్యార్థులకు తెలంగాణలో ఉద్యోగలెందుకివ్వాలి.? తెలంగాణ వారికీ ఆంధ్రా లో ఉద్యోగాలిస్తున్నారా.? అంటూ కవిత లేవనెత్తుతున్న ప్రాంతీయ విద్వేషాలకు నేటి తరం జెన్ జీ లు స్పందించడం లేదు.

ADVERTISEMENT

పైగా కవిత ఈ రెచ్చకొట్టే రాజకీయానికి కౌంటర్ గా ఆమె పై నమోదైన ఢిల్లీ లిక్కర్ కేసు, ఆమె తీహార్ జైలు జీవితం ను తెరమీదకు తెస్తున్నారు. అలాగే కవిత బిడ్డలు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోవచ్చు కానీ ఆంధ్రా పిల్లలు మాత్రం తెలంగాణలో చదువుకుంటే తప్పా.? ఇక్కడ ఉద్యోగాలు చేస్తే నేరమా.? అంటూ సోషల్ మీడియా వేదిక గా కవిత వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు.

ప్రాంతీయవాద రాజకీయాలకు నేటి తరం జెన్ జీ లు ఆకర్షితులవరు అనేలా సోషల్ మీడియా లో కవిత ఆంధ్రా – తెలంగాణ అనే రాజకీయ విధానం పై నిప్పులు చెరుగుతున్నారు జెన్ జీ లు. కేసీఆర్ తెరాస తెలంగాణ రాజకీయాల నుంచి అస్తమించినప్పుడే తెలంగాణలో ప్రాతీయవాద రాజకీయం కూడా ముగిసిన అధ్యాయం గా మారిపోయిందనేది స్పష్టం.

అయినా కానీ కవిత తెరాస 2.0 అంటూ నాటి తరం ఆలోచన విధానాలతో నేటి తరాన్ని ప్రభావితం చెయ్యాలని భావిస్తున్నారు. తెరాస అధికారంలో ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అంటూ తెలంగాణలో మొదలుపెట్టిన నూతన అధ్యాయం చివరికి కల్వకుంట్ల కుటుంబం బంగారు మాయం కావడంతో ముగిసిందా అంటూ కవిత పై సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణలో ఇంకెన్నాళ్లు ఈ ప్రాంతీయవాద రాజకీయాలు.? ఇటువంటి రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఇంకెందరి జీవితాలను రాజకీయ బలిపీటలెక్కిస్తారు అనే ప్రశ్నలు కవిత ను చుట్టుముడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories