2025 వీడ్కోల మాటలా.? 2026 కి రిటర్న్ గిఫ్టా.?

Kavitha Targets Harish Rao, Sparks BRS Political Storm

ఇన్నాళ్లు కేసీఆర్ కుడి భుజం గా బిఆర్ఎస్ పార్టీ వెన్నుముక గా పేరు పొందిన హరీష్ రావు ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ కోవర్ట్ గా కేసీఆర్ కి కట్టప్పగా ప్రచారమవుతున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ చంద్రబాబు గా అభివర్ణించారు జాగృతి అధ్యక్షురాలు కవిత.

దీనితో అన్ని బిరుదులు హరీష్ కేనా అక్కా అంటూ ఒకపక్క బిఆర్ఎస్ శ్రేణుల తో పాటుగా మరోపక్క జాగృతి మద్దతుదారులు కూడా కవిత రాజకియం పై ఆరా తీస్తున్నారు. అయితే హరీష్ పై కవిత ఈ స్థాయిలో రెచ్చిపోతున్నా, హరీష్ ని ఎంతలా రెచ్చకొడుతున్నా హరీష్ మాత్రం ఇప్పటికి ఓపికగానే వ్యవహరిస్తున్నారు.

ADVERTISEMENT

బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వెనుక హరీష్ రావు పాత్ర ఉందనే బలమైన అనుమానాలను కవిత పదేపదే నొక్కి చెపుతున్నారు. అలాగే ఈ రోజు పార్టీలో తనకు ఎదురైన చేదు ఘటనలు ఎదోకరోజు పార్టీ అధినేత కేసీఆర్ కి తప్పవని, పార్టీ వర్కింగ్ కేటీఆర్ కూడా తప్పించుకోలేరని కవిత బలంగా ఉద్ఘాటిస్తున్నారు.

కాళేశ్వరం నుంచి కల్వకుర్తి వరకు హరీష్ అవినీతి భాగోతాలను అంటూ ఆరోపణలు చేస్తున్న కవిత తనకు సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా బిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా, కల్వకుంట్ల ఆడపడుచుగా ఇంటా బయటా తానూ, తన కుటుంబం ఎదుర్కొటున్న అవమానాలు విశదీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్ వ్యూ లో పాల్గొన్న కవిత తెలంగాణ రాజకీయ పరిస్థితుల నుంచి, కల్వకుంట్ల ఇంటి రాజకీయాల వరకు, బిఆర్ఎస్ పార్టీ లో తనకు జరిగిన అవమానాల నుంచి తన భర్తకు ఎదురవుతున్న నిందల వరకు, అన్న కేటీఆర్ నుంచి బావ హరీష్ వరకు అందరికి 2025 ముగింపు మాటలుగా రాబోతున్న 2026 కి జాగృతి రిటర్న్ గిఫ్ట్ ల తరహాలో స్పందించారు.

తన తండ్రి కేసీఆర్ కుటుంబం నుంచి అన్న కేటీఆర్ ఫ్యామిలీ వరకు తన భర్త అనిల్ కుమార్ కి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయని భావోద్వేగానికి గురైన కవిత, కేటీఆర్ భార్య ఫోన్ కూడా అనిల్ ఫోన్ మాదిరి టాపింగ్ కు గురైతే కేటీఆర్ ఇలా ఈజీ గా తీసుకోగలరా.? అంటూ ఫోన్ టాపింగ్ అంశాన్ని మరోసారి తెలంగాణ రాజకీయ తెరమీదకు తెచ్చారు.

అలాగే తెలంగాణ చంద్రబాబు హరీష్ అంటూ హరీష్ రావు కి తన తరుపున మరో బిరుదుని కేటాయిస్తూ, బిఆర్ఎస్ పార్టీలో హరీష్ ని అందరు అలానే పిలుస్తారంటూ మరోసారి హరీష్ టార్గెటెడ్ గా కవిత రెచ్చిపోయారు. అయితే తన ఈ ఆవేదనకు ముఖ్య కారణం కేటీఆర్, హరీష్ అనేది కవిత మాటల వెనుక ఉన్న సారాంశం గా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories