కవిత తెరాస…టీడీపీ కి మరో రాజకీయ ప్రత్యర్థి కానుందా.?

Kalvakuntla Kavitha launching TRS and entering Telangana political battle against TDP 1

తెలంగాణ రాజకీయంగా ఎదగాలి అంటే అందుకు వారి తక్షణ కర్తవ్యం టీడీపీ పార్టీ మీద రాజకీయ ఆరోపణలు చెయ్యాలి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద ప్రాంతీయ విమర్శలు గుప్పించాలి అనేలా తెలంగాణ రాజకీయాలు తెలిసో తెలియకో టీడీపీ చుట్టూ బాబు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీతో పాత సీసాలో కొత్త రసం పోసినట్టుగా తెలంగాణ రాజకీయాలలో కొత్త ప్రయాణానికి నాంది పలికారు కవిత. మరి కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మాదిరి కవిత తెరాస కూడా తెలంగాణ రాజకీయాలలోకి వేగంగా దూసుకుపోవాలంటే ఆ పార్టీ కూడా టీడీపీ కి మరో రాజకీయ ప్రత్యర్థి కాక తప్పదేమో మరి.

ADVERTISEMENT

బిఆర్ఎస్ తానూ రాజకీయంగా బలహీనపడిన ప్రతిసారి టీడీపీ మీద రాజకీయ ఆరోపణలు చేస్తూ, బాబు మీద ప్రాంతీయ విమర్శలు గుప్పిస్తూ తన గులాబీ కారుకి కావాల్సిన రాజకీయ ఇంధనాన్ని సమకూర్చుకుంటుంది. ఇక కాంగ్రెస్ సైతం బిఆర్ఎస్ చేసే ప్రాంతీయ వాద రాజకీయ ఉచ్చులో చిక్కుకుని తనను తానూ తెలంగాణ శ్రోయోభిలాషిగా నిరూపించుకోవడనికి అవసరం లేకపోయినా టీడీపీ మీద ఆ పార్టీ అధినేత బాబు మీద తిట్ల దండకాలు మొదలుపెట్టాల్సిన పరిస్థితి.

అలాగే టి. బీజేపీ కూడా ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ బిఆర్ఎస్ చేసే ప్రాంతీయవాద రాజకీయానికి తలవంచి తెలంగాణలో టీడీపీ తో పొత్తుకు నిరాకరిస్తూ తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు, బీజేపీ చేస్తున్న ఈ ఒంటరి పోరాటంతో ఆ పార్టీ రాజకీయంగా భారీ మూల్యమే చెల్లిస్తున్నా టీడీపీ తో పొత్తుకు మాత్రం వెనకడుగే వేస్తుంది.

అలాంటి పరిస్థితితులలో కవిత తెరాస టీడీపీ మీద తిట్ల దండకాన్ని చదవకుండా, బాబు మీద రాజకీయ విమర్శల అష్టోత్తరం వినిపించకుండా ముందుకు సాగగలదా.? టీడీపీ మీద విమర్శలు చేస్తేనే, బాబు ని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తేనే తెలంగాణ ప్రజలు తమని రాజకీయంగా ఆదరిస్తారు అనే భ్రమ నుంచి తెలంగాణ రాజకీయ పార్టీలు ఇప్పటికి బయటకురాలేకపోతున్నాయి.

అయితే రాజకీయ పార్టీలకు ఆ భ్రమను కల్పించింది మాత్రం కేసీఆర్ తెరాస అనే చెప్పాలి. కేసీఆర్ తెరాస సృష్టించిన ఆ మాయ పొరను కవిత తెరాస తొలగిస్తుందా.? లేదా ఆ పొరకు మరింత బలం చేకురుస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories