చెల్లికి ప్రేమతో కేటీఆర్‌ ఏమిస్తారో?

Kalvakuntla Kavitha press meet with allegations on BRS leaders

కల్వకుంట్ల కవిత నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. అలాగే పార్టీలో అవినీతిపరుల పేర్లను ప్రస్తావించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ మేల్కొకపోతే పార్టీ నిలువునా మునిగిపోవడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ జాగృతితో కలిసి వచ్చే వారందరితో కలిసి తాను ముందుకు వెళ్ళబోతున్నానని చెప్పారు. ఆమె చేసిన ఈ విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్‌ పార్టీకి ఇంకా తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ముఖ్యంగా పార్టీకి మూలస్థంభం వంయి హరీష్ రావుపై అనుమానాలు పెంచుతాయి. పార్టీలో ఆయనతో పడనివారు తిరుగుబాటు చేయవచ్చు లేదా పార్టీని తెలంగాణ జాగృతితో చేతులు కలపవచ్చు. బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి వంటి పలువురు అవినీతికి పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలతో పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటుంది.

ADVERTISEMENT

కనుక ఆమె చేసిన ఆరోపణలను బీఆర్ఎస్‌ పార్టీ ఖండించి అదే స్థాయిలో ఆమెకు ధీటుగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బీఆర్ఎస్‌ పార్టీకి బాగా తెలుసు. కనుక ఇప్పటికే ఆమె ఆరోపణలపై కేసీఆర్‌ చర్చిస్తుండవచ్చు. కనుక నేడో రేపో చెల్లికి ప్రేమతో కేటీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక తప్పదు. కల్వకుంట్ల కవిత రాజకీయాలలో ముందుకు సాగాలనుకుంటున్నారు కనుక ఆమె కూడా మరిన్ని రిటర్న్ గిఫ్టులు బీఆర్ఎస్‌ పార్టీకి పంచిపెట్టడం ఖాయం. బీఆర్ఎస్‌ పార్టీలో ఈ పరిణామాలు అచ్చం వైసీపీలో జగన్‌-షర్మిల ఎపిసోడ్స్ మాదిరిగానే సాగబోతుండటం చాలా ఆశ్చర్యకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories