బంగారు తెలంగాణ అంటే ఏంటో వివరించిన కేసీఆర్

KCR Bangaru Telanganaబంగారు తెలంగాణ తెస్తామని అదికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ‘ఇదేనా బంగారు తెలంగాణ’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం సాధారణం. అయితే దీని మీద ముఖ్యమంత్రి నిండు సభలో వివరణ ఇచ్చారు. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఆయన చెప్పారు. అలా చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.

ADVERTISEMENT

తెల్లారేసరికి భవనాలు కట్టేస్తామా అని కెసిఆర్ ప్రశ్నించారు.దేనికైనా కొంత సమయం పడుతుందని కెసిఆర్ అన్నారు. 40, 50 ఏళ్లపాటు ధ్వంసమైన వ్యవస్థను మూడేళ్లలో నిర్మించడం సాధ్యం అవుతుందా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే ఎన్ని సంవత్సరాలలో అది సాధ్యం అవుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.

అంతకు ముందు బంగారు తెలంగాణ అంటే తనకు అర్థం కావడం లేదని, దీనిపై ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నానని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు సమాధానంగా ముఖ్యమంత్రి ఈ వివరణ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories