ఫామ్ హౌస్ లీకులు…కవిత ఏమంటారో.?

KCR Farmhouse Leaks Stir BRS Politics

ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లీకులతో కవిత పై కొత్త రాజకీయ చదరంగం ఆడుతుందా అన్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లీకులు కవిత ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి, బిఆర్ఎస్ ను వార్తలలో ఉంచుతున్నాయి.

గతంలో కవిత పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ మీడియాలో హల్ చల్ చేసింది, దాని చుట్టూ బిఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతుంది.? కవిత దారెటు.? కవిత చెపుతున్న బిఆర్ఎస్ వెన్నుపోటుదారులెవరు.? అంటూ ప్రత్యేక కథనాలు, చర్చలు, డిబేట్ల లతో బిఆర్ఎస్ మీడియా నోళ్ళల్లో నానింది.

ADVERTISEMENT

ఇక కవిత లేఖ లీకుతో కవిత కూడా తగ్గేదెలా అన్నట్టుగా బిఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్యనాయకుల పై పరోక్ష విమర్శలతో రెచ్చిపోయింది, బిఆర్ఎస్ కు ప్రతిగా జాగృతి కార్యక్రమాలంటూ, టీవీ 5 లో ఇంటర్ వ్యూ లంటూ బిఆర్ఎస్ ను రెచ్చకొట్టింది.

ఇదంతా గడిచిన గతం అనుకుంటే ఇప్పుడు తాజాగా మరో ఫామ్ హౌస్ లీక్ అటు బిఆర్ఎస్ ను ఇటు కేసీఆర్ కుటుంబాన్ని వార్తలలో ఉంచింది. తన చిన్న కుమారుడు అమెరికా చదువులకు వెళుతున్న సందర్భంగా కవిత తన కుమారుడుతో కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే బిఆర్ఎస్ పై కవిత విమర్శలు, ఆ పార్టీ నేతల పై ఆమె ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో రచ్చ లేపుతున్న ఈ సమయంలో కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ గడప తొక్కడంతో కేసీఆర్ కుటుంబ వివాదలు ఇక్కడితో సద్దుమణుగుతాయా.?

కేసీఆర్ కేటీఆర్, కవిత ల మధ్య సయోధ్యకు సంధి చేస్తారా.? అంటూ అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసలు కవితను కలవనేలేదు అంటూ వార్తలు బయటకు లీక్ అయ్యాయి. కేవలం మనవుడికి ఆశీస్సులు అందించి కవితను మాత్రం దూరం పెట్టారంటూ బిఆర్ఎస్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లీకులు రచ్చ చేస్తున్నాయి.

అయితే అటు కవిత ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసినట్టు ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. దీనితో ఈ లీకులకు మరింత బలం చేకూరుతున్నాయి. కేసీఆర్ కవిత మీద ఆగ్రహంగా ఉన్నారని, అందుకే కవితను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించడం లేదంటూ కథనాలు ప్రచారంలో కి వచ్చాయి.

కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి విషయాలు లీకుల రూపుంలో బయటకు రావడం అవి వార్తలుగా ప్రచారం కావడం అంటే కవిత ఆరోపిస్తున్నట్టు బిఆర్ఎస్ లో కేసిఆర్ ఫామ్ హౌస్ లీకులు జరుగుతున్నట్టు, అవి ఇప్పటికి కొనసాగుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి కవిత అమెరికా పర్యటన ముగించుకున్న తరువాత ఈ లీకుల ఫై కూడా స్పందిస్తారా.? లేదా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories