సెంటిమెంట్ డ్రామా మొదలు పెట్టిన కేసీఆర్

Will Rains Stop KCR's Juggernaut?తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కొందరు అంటున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ నుండి అధికార పార్టీ గట్టి పోటీ ఎదురుకుంటుందని అంచనా. కొన్ని రోజులగా బీజేపీనే టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఊహాగానాలకు ఊతం ఇస్తుంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోట ఆంధ్ర-తెలంగాణ మాట రావడం విశేషం.

ఈ తరుణంలో కేసీఆర్ సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టారా అని పలువురు అంటున్నారు. నిన్న ధరణి పోర్టల్ ని లాంచ్ చేస్తూ… దేశంలోనే వరి పండించడం… తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉందని చెబుతూ… “మనం ఏ రాష్ట్రం నుండి విడిపోయామో వాళ్ళు ఎగతాళి చేసేవాళ్లు, వాళ్ళని వెనకకి నేట్టేశాం,” అని అన్నారు ఆయన.

ADVERTISEMENT

కేసీఆర్ దుబ్బాక ప్రచారం సమయంలో దానిని మరింత విస్తృతంగా వాడం ఖాయం. 2018లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు కారణంగా ఆంధ్ర కార్డు కేసీఆర్ కు ఉపయోగపడింది. ఇప్పుడు టీడీపీ దుబ్బాకలో పోటీ కూడా లేదు. అయితే ఇప్పుడు అది ఉపయోగపడుతుందా అనేది చూడాలి. “సెంటిమెంట్ కు కాలం చెల్లిపోయింది.

ప్రజలకు తమ సమస్యలు… అందుకు పరిష్కారాలు కావాలి. ఇక కేసీఆర్ పప్పులు ఉడకవు,” అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కొంచెం సైలెంట్ అవ్వడంతో తెరాస కు మరింత గుబులు పుడుతుంది. దుబ్బాక నియోజకవర్గానికి ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. నవంబర్ 16న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

ADVERTISEMENT
Latest Stories