వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన నాటి నుండీ ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసిఆరే తీసుకుని వచ్చారని చాలా మంది అభిప్రాయం. అందుకు అనుగుణంగానా అన్నట్టు టీఆర్ఎస్ వారు కూడా పెద్దగా షర్మిల ను విమర్శించడం లేదు. తాజాగా ప్రభుత్వం కూడా ఇండైరెక్టు గా షర్మిల కు మద్దతు ఇస్తున్నారని మిగతా పార్టీల వారు విమర్శిస్తున్నారు.
తాజాగా… నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఇటీవలే షర్మిల ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో ఆమె మూడురోజుల పాటు దీక్ష చేయనున్నారు. కానీ.. పోలీసులు మాత్రం షర్మిలకు ఒకే రోజు కోసం పర్మిషన్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే నిరాహార దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిలకు హైదరాబాద్ పోలీసులు అనుమతిచ్చారు.
అయినా షర్మిల మాత్రం తాను మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. మిగిలిన రెండు రోజులు లోటస్ పాండ్ లో దీక్ష కొనసాగనుందని సమాచారం. అయితే కేసీఆర్.. షర్మిల గేమ్ ప్లాన్..కొట్టినట్టు నటిస్తా.. ఏడ్చినట్టు నటించు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఖమ్మం సభకు కూడా 6000 మందికే పెర్మిషన్ అని పోలిసులు అన్నారు.
అయితే సభలో ఆ వాతావరణం కనిపించలేదు. ఆ తరువాత ఆ ఉల్లంఘనలను పట్టించుకున్న నాథుడే లేడు. ఇది కూడా అంతే అని వారు విమర్శిస్తున్నారు. టీవీలో కనిపించే దీక్ష ఎక్కడ చేస్తే ఏంటి? ఏదో ప్రభుత్వం పెర్మిషన్ ఇవ్వలేదు…షర్మిలకు అనుకూలంగా లేదు అని అనిపించుకోవడానికే చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అంత తేలికగా ప్రభుత్వ వ్యతిరేకత చీలే పరిస్థితి ఉంటుందా?





