మరో ఎన్టీఆర్ బయోపిక్… ఇదేమి రచ్చ అంట..!

kethireddy jagadishwar reddy NTR biopicఎన్టీఆర్ బయోపిక్-3 సిద్ధమవుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించగా, నందమూరి బాలకృష్ణ వెన్నుదన్నుగా, దర్శకుడు తేజ మరో చిత్రానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు.

తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో వాణి విశ్వనాథ్ కూడా భాగస్వామ్యమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నప్పటికీ, ఇలా అందరూ కలిసి ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎంత రచ్చ చేస్తారో అన్న భయం ‘అన్న గారి’ అభిమానుల్లో నెలకొని ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories