మాస్ మూలవిరాట్ గా తారక్ కనిపించడం ఖాయమట

Director- Prashanth Neel - Jr NTRకేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని, చిత్రపరిశ్రమలను తన వైపు తిప్పుకున్నాడు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం `కేజీఎఫ్-2` చిత్రీకరణతో ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా సినిమా పోస్టు-ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‌తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నాడని వార్తలు ఎప్పటినుండో ఉన్నాయి.

ADVERTISEMENT

తాజాగా ఎన్టీఆర్ ‌కు ప్రశాంత్ నీల్ ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. “ఓ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఎట్టకేలకు నేను తెలుసుకున్నాను. మళ్లీ కలిసేటపుడు చుట్టూ ఉన్న ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి రేడియేషన్ సూట్ తెచ్చుకుంటాను. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ తారక్. త్వరలోనే కలుద్దాం” అంటూ ప్రశాంత్ ట్వీట్ చేశాడు.

కేజీఎఫ్ లో హీరో యాష్ ని సూపర్ మాస్ గా చూపించాడు ప్రశాంత్. అదే విధమైన సబ్జెక్టు తో గనుక ఎన్టీఆర్ సినిమా చేస్తే… మనం తారక్ లోని మాస్ మూలవిరాట్ ని చూడటం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో ఆయన ఎన్టీఆర్ తో శక్తి చేశారు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడు. ఆ తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతోంది. 2021 చివర్లో గానీ, 2022 మొదట్లో గానీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఇకపోతే కేజీఎఫ్ 2 ఈ దసరాకు విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories