సురేఖకు నచ్చడంతో చాలులే అనుకున్నా – చిరంజీవి!

Khaidi No 150 Chiranjeevi‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను కానీ, అనుష్కను కానీ తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు వినాయక్ కు ముందు నుంచి ఉందని… చివరకు కాజల్ నే ఫైనలైజ్ చేశారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హీరోయిన్ గా కాజల్ ఫైనలైజ్ కావడంతో అందరూ హ్యాపీగా ఉన్నారని… తాను మాత్రం చాలా టెన్షన్ పడ్డానని, చరణ్ తో, పవన్ కల్యాణ్ తో, బన్నీతో కాజల్ నటించిందని… చరణ్ – కాజల్ లు యంగ్ పెయిర్ అని… అలాంటిది తన పక్కన కాజల్ ఎలా సెట్ అవుతుందో అని అనుకున్నానని తెలిపారు.

అనుష్క అయితే సెట్ అవుతుందని… ఆమెనే హీరోయిన్ గా తీసుకుందామని తాను భావించానని చెప్పారు. కాజల్ తో ఎక్కువ ఏజ్ గ్యాప్ కనిపిస్తుందేమోనని… కొంచెం ఎక్కువ వయసున్న హీరోయిన్ అయితే బాగుంటుందనేది తన ఆలోచన అని అన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత తాను, కాజల్ ఉన్న ఒక స్టిల్ పబ్లిసిటీ కోసం బయటకు వచ్చిందని… చరణ్ పక్కనున్న ఈ అమ్మాయి ఉందేంటని ఆ స్టిల్ ను చూసిన సురేఖ ఆశ్చర్యపోయిందని మెగాస్టార్ అన్నారు.

ADVERTISEMENT

ఆ తర్వాత పరీక్షగా చూసి, ‘మీరా?’ అంటూ ఆశ్చర్యపోయిందని… ఇద్దరూ భలే ఉన్నారే, బాగా సెట్ అయింది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందని, సురేఖ మాటతో, ‘చాలు పాస్ అయిపోయావ్’ అని తనను తానూ సమర్ధించుకున్నానని, సురేఖకు నచ్చినప్పుడు అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనకు కలిగిందని చెప్పారు. కాజల్ పక్కన మెగాస్టార్ సెట్ అయ్యారు గానీ, సినిమానే మెగాస్టార్ రేంజ్ తగిన విధంగా సెట్ కాలేదన్నది కాలక్రమేణా ప్రేక్షకుల నుండి వస్తున్న టాక్.

ADVERTISEMENT
Latest Stories