‘బాహుబలి’ తర్వాత స్థానంలో ‘ఖైదీ నంబర్ 150’

Khaidi No 150, Khaidi No 150 Overseas Rights, Chiranjeevi Khaidi No 150 Overseas Rights, Chiru Khaidi No 150 Overseas Rights, Khaidi No 150 USA Rights, Khaidi No 150 US Rightsతెలుగు సినీ మార్కెట్ కు ప్రస్తుతం ఓవర్సీస్ చాలా ప్రామాణికమైనది. ఇటీవల వసూలు అవుతోన్న కలెక్షన్స్ ను పరిశీలిస్తే… ఒక రకంగా మరో నైజాం మార్కెట్ గా ట్రేడ్ పండితులు అభివర్ణిస్తున్నారు. ఓవర్సీస్ లో బొమ్మ సక్సెస్ అయితే రూపాయికి రెండు, మూడు రెట్లు లాభాలు రావడమే దీనికి కారణం. దీంతో పెద్ద హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్న సినిమా “ఖైదీ నంబర్ 150” రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయిందని సినీ వర్గాల టాక్.

ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు మహేష్ ఏర్పరిచిన మార్కెట్ సమయంలో మెగాస్టార్ సినిమాలకు దూరమయ్యారు. దీంతో చిరు సినిమాలకు ఓవర్సీస్ లో ఆదరణ ఎలా ఉంటుందనేది ఇప్పటివరకు తెలియని విషయం. అయినప్పటికీ రికార్డు ధరకు “ఖైదీ నంబర్ 150” అమ్ముడుపోవడం, ఈ సినిమాపై మార్కెట్ వర్గాల్లో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ తర్వాత ఆ రేంజ్ లో ఏకంగా 13.5 కోట్లు వెచ్చించి, ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ADVERTISEMENT

దీంతో ‘బ్రేక్ ఈవెన్’ రావాలంటేనే కనీసం 2 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో గానీ, చిరు రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందని, దీని కోసం ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నయన్న సంకేతాలు ఈ హక్కుల ద్వారా నిరూపణ అవుతోంది. ఎట్టి పరిస్థితులలో 2017 భోగి రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారని “ఖైదీ నంబర్ 150” దర్శకుడు వివి వినాయక్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories