‘ఖైదీ నంబర్ 150’ ఐటెం సాంగ్ టాక్!

khaidi-no-150-ratthalu-song-public-talkప్రస్తుత తరంలో ‘ఐటెం సాంగ్’లకు క్రేజ్ తెచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మాంచి ఊపు తెచ్చే విధంగా, మాస్ ప్రేక్షకుల చేత డ్యాన్స్ లు వేయించే విధంగా సంగీతం అందించడంలో దిట్టగా పేరుగాంచిన దేవిశ్రీప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమాకు ఎలాంటి ఐటెం సాంగ్ ను అందించారోనని మెగా అభిమానులతో పాటు సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూసారు.

ADVERTISEMENT

ఈ పాటలో ‘సర్ధార్’లో పవన్ పక్కన నర్తించిన లక్ష్మీ రాయ్ మెరిసిందన్న విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమాలోని ‘తోబా తోబా’ పాటను మించిపోయే రేంజ్ లో ఈ పాట ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. కానీ, వాటిని అందుకోవడంలో నూటికి నూరు శాతం విఫలమైంది. గడిచిన రెండు, మూడు సంవత్సరాలుగా దేవి ఐటెం సాంగ్స్ ను పరిశీలిస్తే… ఎక్కడో పట్టు కోల్పోయినట్లుగా అర్ధమవుతోంది. ఏవో ‘జనతా గ్యారేజ్’లో ఇచ్చిన ‘పక్కా లోకల్’ వంటి పాటలు మినహాయిస్తే… ప్రతిష్టాత్మక సినిమాల్లో దేవి అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

‘రత్తాలు’ అంటూ సాగే ఈ పాటలో ‘మాస్ డ్యాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు…’ అన్న లిరిక్ లో తప్ప ఎక్కడా జోష్ కనిపించదు. అయితే ఈ సాదాసీదా ఐటెం సాంగ్ లో మెగాస్టార్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లకు ఫుల్ స్కోప్ ఉందన్న విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ముఖ్యంగా పాటలో రెండవ భాగం ‘బాసూ చూపీ నీ గ్రేసు…’ అన్న తర్వాత మెగా ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ గా పాట ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టం. లారెన్స్ కొరియోగ్రఫీ కావడంతో మెగా స్టెప్పులకు కొదవుండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో!

ADVERTISEMENT
Latest Stories