మెగా అభిమానులు తమ అభిమానాన్ని చూపించాల్సిన సమయం వచ్చేసినట్లుంది. గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవిని భుజాన పెట్టుకుని చూసుకుంటున్న మెగా అభిమానులు, రీ ఎంట్రీకి సిద్ధమైన చిరు కోసం ఏకంగా లక్షలకు లక్షల రూపాయలు తృణప్రాయంగా ఖర్చు పెడుతున్నారు. పెద్ద హీరోల మొదటి రోజు మొదటి టికెట్లను వేలం వేయడం ఆనవాయితీగా మారిన తరుణంలో ‘ఖైదీ నంబర్ 150’ టికెట్ల ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి.
బెంగళూరులోని ఓ ధియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు సంబంధించిన టికెట్లు వేలం పెట్టగా, మొదటి మూడు టికెట్లను చిరంజీవి అభిమాని ఒకరు 36 లక్షల రూపాయలకు దక్కించుకున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. అంటే ఒక్కో టికెట్ కు 12 లక్షలు పెట్టారన్న మాట. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంత మొత్తానికి ఒక రోజు లేక రెండు రోజులు ధియేటర్ ప్రదర్శన హక్కులు వచ్చేస్తాయి కూడా! అయితే ఆ అభిమానం పెట్టుబడితో కొనలేనిది కదా! గతంలో బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ ఎత్తున ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.



