‘ఖైదీ’కి అదే పెద్ద మైనస్… ‘శాతకర్ణి’కి అదే పెద్ద ప్లస్..!

khaidi-no-150-vs-gautamiputra-satakarniమెగాస్టార్ మెగా మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఎలా ఉండబోతోంది? అలాగే నందమూరి నటసింహం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఎలా ఉంటుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరో వారం రోజుల పాటు వేచిచూడక తప్పదు గానీ, ప్రస్తుతం మాత్రం ‘ఖైదీ’ సినిమా విషయం అతి పెద్ద మైనస్ గా భావించిన అంశం, ‘శాతకర్ణి’ విషయంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ గా మారిపోయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే… బాలకృష్ణ సినిమా రన్ టైంతో పోలిస్తే, చిరంజీవి సినిమా రన్ టైం మరొక 15 నిముషాలు ఎక్కువగా ఉండడం గమనించదగ్గ అంశం. మొత్తంగా చెప్పాలంటే ‘ఖైదీ నంబర్ 150’ సినిమా దాదాపుగా 147 నిముషాల పాటు సిల్వర్ స్క్రీన్ పై నిరాటంకంగా దర్శనమిచ్చేందుకు ముస్తాబు కాగా, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం కేవలం 135 నిముషాలకే పరిమితం కావడం విశేషం.

ADVERTISEMENT

ప్రస్తుతం సినిమాలు ఎంత తక్కువ సమయం ఉంటే, ప్రేక్షకులకు అంత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా,’ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ఫలితాలలో ఉన్న తేడాను కూడా సినిమా రన్ టైం నిర్ణయిస్తోంది. దీంతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రన్నింగ్ టైం మెగా అభిమానులను కలవరపెడుతోంది. మరో ట్విస్ట్ ఏమిటంటే… ఈ రెండు సినిమాల కంటే, చిన్న సినిమాగా విడుదల కానున్న ‘శతమానం భవతి’ రన్ టైం చాలా తక్కువ.

ADVERTISEMENT
Latest Stories