పైరసీ పేరు మారింది అంతే… బ్యాక్ టు ఫాం..!

KickAss, KickAss Website New Name, KickAss Website New Title, KickAss Site New Name, KickAss Site New Title, KickAss Site New Avatar Nameప్రపంచంలోనే అతిపెద్ద పైరసీ వెబ్ సైట్ గా ఉన్న ‘కిక్ ఆస్ టోరెంట్స్’ను నిలిపివేసి, సదరు వెబ్ సైట్ యజమాని అర్టెమ్ వాలిన్ ను అరెస్ట్ చేసినప్పటికీ, ఆ వెబ్ సైట్ మరో రూపంలో ఆన్ లైన్లో అందుబాటులోకి రావడం విశేషం. ‘కిక్ ఆస్’ ఇప్పుడు పేరు మారిందని, ‘క్యాట్ డాట్ ఏఎం’గా క్లోనింగ్ చేశామని, పలు క్లౌడ్ సర్వర్ల ఆధారంగా దీన్ని అందుబాటులో ఉంచామని క్లోన్ సైట్ల సృష్టికర్త ఒకరు మీడియా సంస్థలకు పంపిన ఈ-మెయిల్ లో వెల్లడించారు.

అప్ లోడ్ లన్నీ బలమైన క్లౌడ్ ఫ్లేర్ వెనుక దాగుంటాయని, ఈ తరహా క్లోన్ సైట్లు చాలానే ఉన్నాయని, తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులూ రావని తెలిపారు. ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే, ఈ క్లోన్ సైట్లు మరింతగా మెరుగైనవని, మొబైల్ వర్షన్ ను కూడా ఆవిష్కరించామని పేర్కొనడం మరింత రెచ్చగొట్టుడు ధోరణిని అనుసరిస్తున్నారన్న విషయం స్పష్టమైంది. గత బుధవారం నాడు సుమారు 6,700 కోట్ల విలువైన పైరసీ చిత్రాలు, సంగీతం తదితరాలను అందించిందని ఆరోపిస్తూ కిక్ ఆస్ టోరెంట్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories