మంత్రి నాని గారికి కోపం వచ్చింది…. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Kodali Nani fires on Chandrababu Naidu and devineni umaప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి జగన్ ప్రభుత్వంలోని మంత్రులు చంద్రబాబుని తిట్టడంలో ఒకరికొకరు పోటీ పడి ముఖ్యమంత్రిని ఇంప్రెస్స్ చేసే పనిలో ఉంటున్నారు. అయితే టాప్ ర్యాంకు మాత్రం ఎప్పుడు కొడాలి నానిదే. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఒక మంత్రి ఇలా కూడా మాట్లాడతారా అనే అనుమానాలు రాకపోవచ్చు.

ADVERTISEMENT

అయితే నాని గారికి ఇప్పుడు కోపం వచ్చింది. తెలుగుదేశంలో ఉన్న నాటి నుండి పడని దేవినేని ఉమపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అదంతా షరా మాములే గానీ… ఉమకు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకటి మాత్రం హైలైట్. సీఎంను మరోసారి ఏకవచనంతో మాట్లాడితే మూతి పగలగొడతా అంటూ దేవినేని ఉమాని హెచ్చరించారు.

సీఎంకు మర్యాద ఇవ్వడం మంచిదే గానీ ఆ విషయం నాని చెప్పడమే ఆశ్చర్యం. వయసులో ఎంతో పెద్దవారైనా చంద్రబాబు నాయుడుని ఏ రోజు నాని మర్యాద ఇచ్చి మాట్లాడలేదు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ… ఏకవచనమే. చాలా సార్లు బూతులు కూడా బోనస్. పోనీ వయసు గురించి పక్కన పెడితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నాని ఆయనకు మర్యాద ఇచ్చింది లేదు.

పోనీ మర్యాద ఇవ్వమని అడిగిన ప్రెస్ మీట్ లోనైనా చంద్రబాబుకు మర్యాద ఇచ్చారంటే అది కూడా లేదు. ఇప్పుడు మాత్రం సీఎం జగన్ కు మర్యాద కావాల్సిందే అంటున్నారు. ఏకవచనంతో మాట్లాడితే మూతి పగలగొడతా అంటూ హెచ్చరిస్తున్నారు. ఆ మర్యాద ఇవ్వడం అనేది ముందు మంత్రిగారు మొదలుపెట్టి అడిగితే చాలా బావుంటుంది.

ADVERTISEMENT
Latest Stories