గుడివాడ టికెట్‌ నాకే… కాదని జగన్‌ చెప్పారా?

Kodali Nani

ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో గుడివాడ ‘హాట్ సీట్’గా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడని టిడిపి, జనసేనలు ‘మార్క్’ చేయడమే ఇందుకు కారణం. అక్కడి నుంచి టిడిపి, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిగా వెనిగండ్ల రాము పోటీ చేయబోతున్నారు.

ADVERTISEMENT

ఇరుపక్షాల అభ్యర్ధులు ఖరారు అయిన తర్వాత నిన్న హటాత్తుగా గుడివాడ పట్టణంలో జిల్లా వైసీపి అధ్యక్షుడు, మండల హనుమంతరావు వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. కానీ వెంటనే మునిసిపల్ సిబ్బంది తొలగించేశారు. కానీ ఆ కొద్ది సేపటిలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే తాను గుడివాడ నుంచి పోటీ చేయడం లేదని, కొడాలి నానియే మళ్ళీ పోటీ చేస్తారని హనుమంతరావు చేతే మీడియాకు చెప్పించింది.

కొడాలి నాని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, జగన్‌ తనకు తప్పకుండా టికెట్‌ ఇస్తారని నమ్మకం వ్యక్తంచేశారు. ఇదంతా టిడిపి చేసిన దుష్ప్రచారమేనని మళ్ళీ నేనే గుడివాడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఇంతవరకు గుడివాడతో సహా జిల్లాలో పలు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదనే విషయాన్ని కొడాలి నాని మీడియాకు గుర్తు చేసి చెప్పారు కూడా.

అయితే కొడాలి నాని ఈసారి ఎన్నికలలో ఓడిపోయే అవకాశం ఉన్నందునే, జగన్మోహన్‌ రెడ్డి ఆయనను కాపాడేందుకు మండల హనుమంతరావుని బలిపశువుగా నిలబెట్టబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు, వైసీపి అధినేత జగన్, కొడాలి నాని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నందునే గుడివాడ పట్టణం నడిబొడ్డున హనుమంతరావు వైసీపి అభ్యర్ధి అంటూ ఫ్లెక్సీ బ్యానర్‌ పెట్టారు. కానీ వైసీపి ఎన్నికలకు ముందే ఓటమికి సిద్దమైపోతోందనే తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపిన్నట్లవుతుందని గ్రహించగానే నిన్న హనుమంతరావు చేత, నేడు కొడాలి నాని చేత మీడియా ఖండన ప్రకటనలు చేయించి ఉండవచ్చు.

తినబోతు గారెల రుచి ఎలా ఉందో తెలుసుకోనక్కరలేదన్నట్లు, నేడో రేపో వైసీపి విడుదల చేసే 8 లేదా 9వ జాబితాలో గుడివాడ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో తేలిపోవచ్చు. ఒకవేళ కొడాలి నానిని పక్కన పెట్టి హనుమంతరావుకే టికెట్‌ ఇస్తే అప్పుడు జనాలకు ఏం చెప్పాలో కొడాలి నాని ఇప్పుడే మరో స్టోరీ సిద్దం చేసుకుంటే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories