ఆయన్ని ముసలినక్క అన్నారు! మరి మీరు?

Kodali Nani

ఆంధ్రప్రదేశ్ బూతుల మంత్రిగా ప్రఖ్యాతి గాంచిన గుడివాడ శాసనసభ సభ్యులు కొడాలి నాని 2024 ఎన్నికలే తన చివరి ఎన్నికలుగా ప్రకటించారు. 2029లో మళ్ళీ పోటీ చేయబోనని, తనకు ఇద్దరు కూతుళ్ళని, వాళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, కానీ తన సోదరుడు కుమారుడికి రాజకీయాలపై ఆసక్తి ఉంటే గనుక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటానని చెప్పుకొచ్చారు.

తనకు ప్రస్తుతం 53 ఏళ్ళ వయసుందని, ఈ ఎన్నికల తర్వాత 58 ఏళ్ళు వచ్చేస్తాయని, ఆ వయసులో ఇంకా రాజకీయాలు చేయలేనని కీలక వ్యాఖ్యలు చేసారు. గుడివాడలో తనకు తిరుగులేదని, తనపై గెలిచే మగాడే లేడని ప్రగల్భాలు పలికే కొడాలి నానికి ఉన్నట్లుండి, ఇలాంటి సింపతీ డైలాగ్స్ ఎందుకొచ్చాయో మరి?!

ADVERTISEMENT

బహుశా గుడివాడలో తన సీటును జగన్ ప్రకటించరనే సంకేతాలు వచ్చాయా? లేక సింపతీతో అయినా ఈ సారి ‘మమ’ అనిపించుకుని ఎలా అయినా గుడివాడలో బెర్తు ఖాయం చేయాలని భావించారో తెలియదు గానీ, ఎప్పుడూ బూతులు మాట్లాడే కొడాలి నోట ఎలా బీదారపు వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

అయితే ఇందులో గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఇటీవల చంద్రబాబు గురించి ఇదే కొడాలి నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికలే తన చివరి ఎన్నికలుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సమయంలో ‘ఈ ముసలి నక్క సింపతీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసారు, మీరెవరూ నమ్మొద్దని’ అంటూ తనదైన శైలిలో ఎప్పటిలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబుని ‘ముసలినక్క’తో అభివర్ణించిన కొడాలి నానిని ఏ విధంగా వర్ణించాలో?! ‘మనం చేస్తే సంసారం… పక్కన్నోళ్లు చేస్తే …..’ అన్న రీతిలో వ్యాఖ్యలు చేసే ఈ వైసీపీ నేత 2029లో పోటీ గురించి మాట్లాడే ముందు, ఈ ఎన్నికలలో ఎలా గెలవాలో ఆలోచిస్తే మంచిదేమో! సీటు దక్కడమే కష్టమనుకుంటే, దక్కినా గెలవడం ఇంకా కష్టమని ‘పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ’ చెప్తోన్న విషయం.

ADVERTISEMENT
Latest Stories