ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్ష నేతల్లో అహంకారం పెరుగుతుందా?

Kodali Naniఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్ష నేతల్లో అహంకారం పెరుగుతుంది అని ప్రజలు అనుకునే స్థాయికి నాయకుల మాటలు ఉంటున్నాయి. నిత్యం తన నోటిదురుసుతో వార్తల్లో ఉండే మంత్రి కొడాలి నాని మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. గుడివాడలో పాదయాత్ర నిర్వహించిన మంత్రి తెలుగుదేశం పార్టీ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

టీడీపీ నేతలను జగన్నాథ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని హెచ్చరించారు.‘నా ఇల్లు-నా సొంతం’ అంటూ ఓడిపోయిన టీడీపీ నాయకులు రోడ్డెక్కి షో చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకులు అవతలి వారిని నిలిపేయడం చంపెయ్యడం ఉండదు.

అటువంటి చేతలు కాదు కదా కనీసం మాటలను కూడా ప్రజలు హర్షించరు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే భారీ రథాలు కూలగొట్టారు ప్రజలు. ఇటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చెయ్యడంతో అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎంతో మంచిది.

అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిదానికీ కోర్టులు అడ్డుకున్నాయి, చంద్రబాబు అడ్డుకున్నారు అంటూ చెప్పే భేల మాటలను ప్రజలు ఎంతో కాలం హర్షించరు. చివరికి చెప్పింది చెయ్యగలిగావా అనేదే ప్రజలు చూస్తారు. కావున కోర్టులలో ఎందుకు చిక్కులు ఎదురయ్యాయో తెలుసుకుని వాటిని సవరించుకుని చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories