కోడి ‘తలకట్టు, చేతికట్టు’లపై ఫ్లాష్ బ్యాక్!

kodi-ramakrishna-about his head bandకోడి రామకృష్ణ అనగానే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకంటే ముందు ఆయన తలకట్టు గుర్తుకు వస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా కొనసాగిన కోడి తాజాగా ‘నాగభరణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా… పంచుకున్న సినీ అనుభవాలలో తన తలకట్టుకుండే తెల్లటి బ్యాండ్ గురించి కూడా చెప్పుకొచ్చారు.

“నా రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో… బాగా ఎండకాలంలో షూటింగ్ జరుగుతోంది. ఇంతలో చిత్ర యూనిట్ లో వాళ్లు ఒకరు వచ్చి నా నుదురుకు ఎండ తగలకుండా కట్టుకోమని ఒక క్లాత్ ఇచ్చారు. ‘నీ ఫోర్ హెడ్ పెద్దది. ఎండ బాగా తగులుతుంది. ఇది కట్టుకో’ అని అన్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పద్ధతి. నా కన్నా ఎక్కువగా నా తలకు కట్టుకునే బ్యాండ్ ఫేమస్ అయిపోయింది” అని కోడి రామకృష్ణ నవ్వుతూ అన్నారు.

ADVERTISEMENT

అలాగే చేతికి చుట్టూ ఉండే తాళ్ళు గురించి చెప్తూ… “ఒక రోజు కాలువలో పడి నేను కొట్టుకుపోతుంటే.. మధ్యలో ఒక వ్యక్తి నన్ను బతికించాడు. ఈ విషయాన్ని అమ్మకు చెబితే… బాధ, కోపం, ప్రేమతో నన్ను బాగా కొట్టింది. దేవుడికి దండం పెట్టకుండా, పూజ చేయకుండా బయటకు వెళ్లొద్దు అని ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు వరకు నేను పాటిస్తూనే ఉన్నాను.

అందుకే, ఫ్రీగా ఉంటే 3 గంటలు పాటు… బిజీగా ఉంటే అరగంట పూజ చేస్తాను. మరీ బిజీగా ఉంటే నేను ప్రయాణిస్తున్న కారులోనైనా ఖచ్చితంగా పూజ చేసేస్తాను. నా చేతికి రకరకాల తాళ్లు ఉంటాయి, అవన్నీ ఎవరో ఒక స్వామీజీ కట్టినవే. అదే విధంగా, నా చేతికి ఉంగరాలు ఉండటం కూడా సెంటిమెంటే” అంటూ తన హెడ్ బ్యాండ్ గురించి కూడా వివరించారు.

ADVERTISEMENT
Latest Stories