కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పలు తుంటరి ప్రశ్నలకు సొగసైన సమాధానాలు ఇచ్చింది. గతంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో నడిపిన ప్రేమాయణంపైనా కరణ్ ప్రశ్నించి, సానియా నుంచి సమాధానాలు రాబట్టాడు. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా, షాహిద్ తో ప్రేమాయణంపై వచ్చిన రూమర్లపై స్పందిస్తూ…
ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను నిత్యమూ ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటానని, అవేమీ గుర్తు లేవని, షాహిద్ తో డేటింగ్ చేయలేదని స్పష్టం చేసింది. ఇక, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో అవకాశం వస్తే ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగగా, రణబీర్ కపూర్ ను చేసుకుని ఉండేదానినని తనదైన స్టయిల్ లో సానియా సమాధానం ఇచ్చింది. ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే, ఆ ఛాన్స్ షాహిద్ దేనని చెప్పింది.



