సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కి ఉన్నఫళంగా హరీష్ రావుకి సపోర్టు చేసేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు పడేదుంటే కేవలం మంత్రి హరీశ్‌రావు వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు. తెరాసలో ఆయనే కొంచెం కష్టపడతారని పేరొందారని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా కేటీఆర్ కు హరీష్ కు పడదని కూడా చెప్పారు.
హరీష్ రావు ఇంట్లో ఫంక్షన్ ఉంటే కేసీఆర్ తనయుడు, ఐటీమంత్రి కేటీఆర్ కావాలనే వెళ్లలేదని.. ఆ సమయంలో బెంగుళూరు వెళ్లి కేటీఆర్ సినిమా చూసొచ్చాడని కోమటిరెట్టి ఆరోపించారు. సీఎం కేసీఆర్ లేకపోతే బావా, బావమరుదులు (హరీశ్ రావు, కేటీఆర్) రోడెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.
చాలా కాలంగా హరీష్ రావుకు కాంగ్రెస్ గేలం వేస్తుంది. కేటీఆర్ తో విభేదించి హరీష్ పార్టీని చీల్చి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం ఉంది. అయితే హరీష్ మాత్రం ఎప్పటికప్పుడు తాను కేసీఆర్ కు వీరవిధేయుడినే అని ప్రకటించుకుంటూ ఉంటారు. తాజా గా కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక అంతరం ఏంటో!



