‘వర్మ’ను తిడుతూ ‘వర్మ’ దారిలోనే నడిచిన ‘నాగబాబు!’

Konidela Nagendra Babu fires on ram gopal Varmaసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడగా, ఆ వెంటనే వర్మ నుండి భారీ కౌంటర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఎవరి వాదనలు వారికున్నాయి… కాబట్టి ఎవరిదీ తప్పు అనలేం, ఎవరిదీ కరెక్ట్ అనలేం. కానీ, మెగా సోదరుడు ఉపయోగించిన ‘ట్రిక్’ మాత్రం, వర్మ నుండి స్ఫూర్తి పొందినదే అంటున్నారు సినీ జనాలు. అవును… సరిగ్గా తన సినిమా మరో వారం, పది రోజుల్లో విడుదల అవుతోంది అనగా, వర్మ ఏదొక సంచలనమైన ప్రకటనతో ముందుకు వచ్చి, సినిమాను వార్తల్లో నిలిపేలా చేస్తారన్న విషయం జగమెరిగినదే.

ADVERTISEMENT

ఎలాంటి ఖర్చు లేకుండా సదరు సంచలన అంశాలను ప్రస్తావిస్తూ వరుస కధనాలు ప్రసారం చేయడం మీడియా వర్గాలు సహజంగా చేసే పనే. సరిగ్గా ఇదే ఫార్ములాను మెగా బ్రదర్ నాగబాబు కూడా వినియోగించినట్లుగా కనపడుతోంది. అయితే ఎవరి నుండి స్ఫూర్తి పొందారో, వారినే టార్గెట్ చేస్తూ నాగబాబు స్పందించడం విశేషం. మరో మూడు, నాలుగు రోజుల్లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా విడుదల అవుతోంది అనంగా, ప్రీ రిలీజ్ వేడుకలో సంచలనంగా స్పందించడం మీడియా వర్గాలకు హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో నాగబాబు వ్యక్తిగత పబ్లిసిటీతో పాటు, ‘ఖైదీ నంబర్ 150’కి కూడా ఉచితంగా పబ్లిసిటీ లభించినట్లే. దీనికి తోడు వర్మ ఏదైనా విషయాన్ని పట్టుకున్నారంటే… దాన్ని చీల్చిచెండాడే వరకు వదిలిపెట్టరన్న విషయం నెటిజన్లకు తెలిసిందే. దీంతో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీకి ‘ప్రీ పబ్లిసిటీ’ ఖాయం. నిజానికి ఈ విధమైన విశ్లేషణలు రావడానికి ఓ కారణం ఉంది. ఆడియో వేడుకలపై తప్ప నాగబాబు, మరే ఇతర సందర్భంలో ఇంత ఏమోషనల్ గా స్పందించరు. గతంలో చెర్రీ సినిమా ఆడియో వేడుకలో పవన్ ఫ్యాన్స్ పై ఇదే రకంగా మండిపడుతూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

నిజంగా నాగబాబుకు అంత ఆవేదన, చిత్తశుద్ధి ఉంటే ఆడియో వేడుకల వరకు వేచిచూడడం ఎందుకు? యండమూరి చెర్రీపై చెప్పి ఎన్నాళ్ళు అయ్యింది? అలాగే వర్మ ట్వీట్లు చేసి ఎంతకాలం గడిచింది? ఒక రకంగా ఓ 50 మందికి మాత్రమే తెలిసిన సదరు విషయాలను, ఇప్పుడు బహిరంగ వేదికపై ప్రస్తావించడం ద్వారా నూటికి నూరు శాతం 100 మందికి తెలిసేలా చేసి, తను తీసుకున్న గోతిలో తనే పడేలా మాట్లాడరన్నది విశ్లేషకుల మాట. ఇక, వర్మ అయితే ఏకంగా ‘నీ అన్న వలన మాత్రమే నువ్వు జీవనం సాగిస్తున్నావు’ అని నేరుగా చెప్పారంటే, అది ‘సెల్ఫ్ గోల్’ కాదా అన్నది మెగా బ్రదరే పరిశీలించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories