మహేష్ సినిమాపై కబురందించిన కొరటాల!

Koratala Siva Clarifies Rumours On Mahesh Babu Balakrishna Multi Starerప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా ఓ సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓ భారీ మల్టీస్టారర్ అని బాలకృష్ణ – మహేష్ కాంభినేషన్ లో సిద్ధం కాబోతుందన్న వార్తలు ఇటీవల సినీ వర్గాలలో ప్రచారం జరిగాయి. దీంతో సదరు సమాచారంపై దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ADVERTISEMENT

“తన తదుపరి సినిమా కోసం ఎలాంటి క్రేజీ కాంభినేషన్లను సిద్ధం చేయట్లేదని, అలాగే ఆ సినిమా ఒక మల్టీస్టారర్ కూడా కాదని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పుకార్లన్నింటిని పట్టించుకోవద్దని” ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో మహేష్ – బాలయ్య కాంబో ఒక పుకారేనని తేలిపోయింది. ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇచ్చిన మాట్లాడిన కొరటాల, ‘ఈ సినిమాలో మహేష్ పాత్ర ఫన్ లవింగ్ బాయ్ గా ఉంటుందని, మహేష్ లోని మరిన్ని షేడ్స్ ను వాడుకునేలా’ ఉంటుందని సెలవిచ్చారు.

అయితే, దాదాపుగా ఇలాంటి మాటలే అర్జున్’కు ముందు గుణశేఖర్, ‘ఖలేజా’కు ముందు త్రివిక్రమ్, ‘ఆగడు’కు శ్రీనువైట్ల వంటి వారు చెప్పారు. మహేష్ నటనలోని మరిన్ని యాంగిల్స్ ను తాము వినియోగించుకుంటున్నామని తెలిపిన విశేషాలను ప్రిన్స్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ వ్యాఖ్యలను ఫాలో అయినా పర్లేదు గానీ, ఆ సినిమాల ఫలితాలను మాత్రం అనుసరించేలా తీయవద్దంటూ కొరటాలకు హితవు పలుకుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories