షూటింగ్ ముగింపు దిశగా క్రాక్

Krack-Movie-wraps-shootingమాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. వేసవికి విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవలే అన్ని జాగ్రత్తల మధ్య షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్త‌యింది.

ADVERTISEMENT

త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లే. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్‌’ లో శృతి హస్సన్ హీరోయిన్.. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. రవితేజ గత కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు ఏవీ రాణించక స్పష్టంగా కష్టపడుతున్నాడు. మంచి కమ్ బ్యాక్ ఇవ్వడానికి ఈ చిత్రాలపై అధిక ఆశలు పెట్టుకున్నాడు. గతంలో రవితేజ కోసం డాన్ సీను మరియు బలుపులతో కలిసి రెండు హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని నుండి క్రాక్ వస్తుంది. చూడాలి ఈ రెండు సినిమాలతో రవితేజ్ ఫేట్ ఎలా ఉండబోతుందో!

ADVERTISEMENT
Latest Stories