ఈ ‘కృష్ణుడు’ క్రోధంగా ఉన్నాడే!

Nani - Krishnarjuna Yudham First Lookట్రిపుల్ హ్యాట్రిక్ మూవీగా నాని కెరీర్ లో ఈ సమ్మర్ కు విడుదల కాబోతున్న “కృష్ణార్జున యుద్ధం” సినిమా ఫస్ట్ లుక్ ను భోగి పండగ సందర్భంగా నాచురల్ స్టార్ విడుదల చేసారు. మీసాలు తిప్పి, గడ్డంతో ఊర మాస్ లుక్ లో నాని కనపడుతున్నాడు. సాధారణంగా కృష్ణ అంటే చుట్టూ గోపికలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటాడు. కానీ నాని మాత్రం క్రోధంగా కృష్ణ లుక్ లో దర్శనమిస్తున్నాడు.

ADVERTISEMENT

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఈ కృష్ణుడు కాగా, మరొకటి అర్జునుడు. ఈ రెండో పాత్ర ఎంట్రీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories