కేటీఆర్‌ గారు…విద్యుత్ కోతల గురించి కూడా మాట్లాడండి ప్లీజ్!

KTR Jaganఏపీలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజలు పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఒక్కసారి ఎద్దేవా చేయగానే యుద్ధప్రాతిపదికన రాష్ట్రంలో రోడ్లు మరమత్తులు మొదలుపెట్టడం చాలా విశేషం. కేటీఆర్‌ ఎద్దేవా చేసిన కొన్ని రోజులకే సిఎం జగన్మోహన్ రెడ్డి హడావుడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో రోడ్ల మరమత్తులకు రూ. 1,080 కోట్లు కేటాయించి వెంటనే టెండర్లు పిలిచి 10 రోజులలో పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.

దీంతో పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం రూ.1,072.92 కోట్లు వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 6,425.88 కిమీ రోడ్ల మరమత్తు పనులకు టెండర్లు పిలిచింది. ఈ నెల 19వ తేదీన ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించి, మూడు రోజులలోగా వాటిని ఖరారు చేసి వెంటనే పనులు మొదలు పెట్టించాలని అధికారులు భావిస్తున్నారు.

పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం లెక్కల ప్రకారమే 157 శాసనసభ నియోజకవర్గాలలో 1,845 రోడ్లలో 193.98 కిమీ మేర గుంతలు పడ్డాయి. మరో 1,972 కిమీ మేర రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ మేరకు కొత్తగా రోడ్లు వేయవలసి ఉంది. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8 శాసనసభ నియోజకవర్గాలలో రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించి ఆ పనులను మొత్తం 29 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరు సంస్థలకు అప్పగించనున్నారు.

ఇన్నేళ్ళుగా మరమత్తులకు నోచుకోని రోడ్లను పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఒక్కసారి ఎద్దేవా చేయగానే యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయిస్తుండటంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనుక మంత్రి కేటీఆర్‌ ఏపీలోని విద్యుత్‌ కోతలు, పరిశ్రమల ఏర్పాటు, అమరావతి గురించి కూడా ఓ నాలుగు ముక్కలు మాట్లాడాలని కోరుకొంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు వారీగా పాడైన రోడ్లు, వాటికి ప్రభుత్వం చేయబోతున్న ఖర్చు వివరాలు:

జిల్లా మరమత్తులు చేయవలసిన రోడ్ల పొడవు (కి.మీ) గుంతలు పడ్డ రోడ్ల పొడవు

ADVERTISEMENT

(కి.మీ)

మరమత్తులకు చేయబోతున్న ఖర్చు (కోట్లలో)
శ్రీకాకుళం 171.88 8.40 28.98
విజయనగరం 375.07 40.55 68.24
పార్వతీపురం మన్యం 209.04 37.53 33.76
విశాఖపట్నం 28.26 3.05
అనకాపల్లి 161.46 33.07
అల్లూరి సీతారామరాజు 378.76 3.00 57.29
కాకినాడ 166.09 0.30 37.63
తూర్పు గోదావరి 188.61 26.61 38.67
కోనసీమ 217.83 6.45 53.51
పశ్చిమ గోదావరి 187.60 4.00 44.26
ఏలూరు 378.46 1.00 80.63
కృష్ణా 281.79 44.00
ఎన్టీఆర్‌ 164.29 18.35
గుంటూరు 188.94 32.93
పల్నాడు 314.90 9.22 47.53
బాపట్ల 159.77 28.10
ప్రకాశం 342.34 37.99
నెల్లూరు 525.04 3.34 124.94
తిరుపతి 259.03 8.77 49.80
చిత్తూరు 289.24 3.91 39.33
వైఎస్సార్ 152.24 30.57
అన్నమయ్య 212.31 34.60
కర్నూలు 303.32 20.70 25.49
నంద్యాల 159.10 16.40 18.04
శ్రీ సత్యసాయి 210.55 26.68
అనంతపురం 399.95 3.80 35.43

ADVERTISEMENT
Latest Stories