కేటీఆర్‌ ఫోన్ చేస్తే ప్రభాస్‌ కాల్‌ కట్‌! నిజమా?

KTR calls Prabhas during podcast with teenage students

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చాలా దూకుడుగా, ఆవేశంగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. అయితే సందర్భాన్ని బట్టి ఆయన ఎంత కూల్‌గా, సరదాగా ఉండగలరో మరోసారి చూపించారు.

అండర్‌ 18 టీనేజ్‌ విద్యార్థులతో కలిసి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, ‘డయల్ ఏ స్టార్’ కోసం టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఆయన చేతిలో నుంచి ఓ బాలిక ఫోన్‌ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ‘ఆయన నీతో మాట్లాడరు’ అంటూ కేటీఆర్‌ చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభాస్‌ ఫోన్‌ ఎత్తారు. దీంతో ఆ బాలిక ప్రభాస్‌ను ఆటపట్టించబోయింది. తనకు ఈ ఫోన్‌ రోడ్డుపై దొరికిందని, ‘మీరెవరు?’ అని అడగడంతో ప్రభాస్‌ వెంటనే కాల్‌ కట్‌ చేశారు. దీంతో అక్కడున్న కేటీఆర్‌, విద్యార్థులు అందరూ హాయిగా నవ్వుకున్నారు.

ADVERTISEMENT

ఆ తర్వాత మళ్లీ కేటీఆర్‌ అదే ఫోన్‌ నుంచి ఫోన్‌ చేసినప్పుడు ప్రభాస్‌ వెంటనే ఫోన్‌ ఎత్తడం విశేషం. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. మళ్లీ అదే ఫోన్‌ నుంచి కాల్‌ వస్తే ఎత్తరేమో అనుకుంటే, ప్రభాస్‌ మాత్రం వెంటనే ఫోన్‌ ఎత్తి మాట్లాడటం ఆయన హుందాతనానికి నిదర్శనమనుకోవచ్చు. ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్‌ ఎప్పుడూ చాలా సరదాగానే ఉంటారని ఆయనతో పనిచేసిన వారు చెబుతూ ఉంటారు. అది నిజమేనని కేటీఆర్‌తో కాసేపు సరదాగా మాట్లాడి నిరూపించారు.

అటు రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరించే కేటీఆర్‌.. ఇటు సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా బిజీగా ఉండే ప్రభాస్‌.. ఇద్దరూ ఈ సరదా సందర్భంలో చాలా కూల్‌గా కనిపించడం ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం కేటీఆర్‌-ప్రభాస్‌ ఫోన్‌ కాల్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ADVERTISEMENT
Latest Stories