తండ్రి పేరుతో కేటీఆర్‌, సొంత కాళ్ళపై కవిత!

KTR and Kalvakuntla Kavitha contrasting political approaches in Telangana

కల్వకుంట్ల కవితకు రాజకీయ అనుభవం, ఎంపీ, ఎమ్మెల్సీగా అనుభవం ఉంది కానీ మంత్రిగా అనుభవం లేదు. అలాగే రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి సంపాదించుకున్నారు కానీ బీఆర్ఎస్‌ పార్టీపై పట్టు ఉండేది కాదు.

ఓటమి తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌసులో రాజకీయ సన్యాసం పాటిస్తుంటే, బీఆర్ఎస్‌ పార్టీ పగ్గాలు కేటీఆర్‌ చేతికి వచ్చాయి. కనుక ఆయన కనుసైగ చేస్తే రాష్ట్రంలో గులాబీ దండు కదిలివస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆమె కంటే కేటీఆర్‌ వంద రెట్లు ఉన్నతమైన స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కానీ కేటీఆర్‌ నేటికీ తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటే, పార్టీ నుంచి బహిష్కరించబడి అయోమయ స్థితిలో ఉన్న కల్వకుంట్ల కవిత కేవలం 15 రోజులలో తేరుకొని మొదట తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసుకొని చురుకుగా రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించారు.

ఆమె ఎక్కువ కాలం రాజకీయాలలో నిలబడలేరనుకునేవారి సైతం ఆశ్చర్యపోయేలా ఈ నెల 25న కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. వచ్చే ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, ముఖ్యమంత్రి అవడమే తన లక్ష్యమని కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా చెప్పారు.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్‌, నేటికీ మళ్ళీ తన తండ్రి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నేతృత్వంలోనే అందరం పనిచేస్తామని చెప్పుకుంటున్నారు.

తెలంగాణ సాధించిన మొనగాడు కేసీఆర్‌ కొడుకునని (తండ్రి చాటు బిడ్డనని) చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని కేటీఆర్‌ స్వయంగా చెప్పుకుంటున్నారు.

కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే, “నా తండ్రి కేసీఆర్‌ వేరే పార్టీకి అధినేత కనుక అయన పేరు, ఫోటో ఏదీ నేను వాడుకోను. ఆ అవసరం కూడా లేదని కల్వకుంట్ల కవిత ఖరాఖండిగా చెప్పేశారు.

అంటే కల్వకుంట్ల కవిత స్వశక్తితో తనకంటూ ఓ సొంత గుర్తింపు సాధించి, తన కాళ్ళపై తాను నిలబడి తన శక్తిసామర్ధ్యాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ నేటికీ కేటీఆర్‌ మాత్రం తండ్రి పేరు చెప్పుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీకి అధినేత కేసీఆరే. తెలంగాణ ప్రజలలో ఆయనకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. కనుక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని చెప్పుకోవడం తప్పు కాదు.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ పగ్గాలు చేతికి వచ్చి రెండున్నరేళ్ళయినా, ఇంతవరకు కేటీఆర్‌ ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.

కేసీఆర్‌ పార్టీ, రాజకీయాల నుంచి తప్పుకున్నా వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రాగలమని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. రాజకీయాలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని కల్వకుంట్ల కవిత ఊరికే అనలేదని అర్ధమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories