‘రుద్రమదేవి’ చిత్రీకరించిన ప్రాంతంలో పర్యాటకుల కళ!

Kuntala Waterfall, Kuntala Waterfall Adilabad, Kuntala Waterfall Adilabad District, Kuntala Waterfall Adilabad District Visitors, Kuntala Waterfall Visitపాల నురుగులాంటి జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వేగంగా కిందకి జారుతూ హొయలొలికిస్తున్న వాటిని కనులారా వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంతో పరవశించి పోతున్నారు. మనసు దోచే ఈ జలపాతాలు ఎక్కడో సుదూర ప్రాంతాల్లోనో, రాష్ట్రానికి ఆవలో ఉన్నవి కాదు. అచ్చంగా తెలంగాణలోనే. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కళ తప్పిన జలపాతాలు మళ్లీ సందడి చేస్తున్నాయి.

ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో హోరున కిందికి దూకుతున్న వీటిని చూసేందుకు ఆయా జిల్లాల వాసులే కాదు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిలకిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. 150 అడుగుల పైనుంచి పెద్ద శబ్దంతో కిందికి దూకే కడెం నదీ జలాల్లో తడిసి ముద్దయి పోవాలని పర్యాటకులు ఆరాటపడుతూ… ఆ అద్భుత దశ్యాన్ని కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోతున్నారు.

ADVERTISEMENT

ఇటీవల వెండితెరకెక్కిన “రుద్రమదేవి” సినిమాలో కొంత భాగాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. దుష్యంతుని భార్య శకుంతల ఈ జలపాతంలో స్నానం చేయడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. దీనికి సమీపంలోనే బోథ్ మండలంలో పోచేరా జలపాతం ఉంది. 20 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకే గోదావరి ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు. నేరెడిగొండలో ఉన్న మరో జలపాతం గాయత్రి, అలాగే ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలోని బొగత జలపాతం, వరంగల్ జిల్లా కొమ్మలవంచ గ్రామంలోని భీమునిపాదం జలపాతాలు కూడా పర్యాటకులకు మధురానుభూతులు పంచుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories