ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకుకర్నూలు శివారులో చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరువెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి కాగా దానిలో ప్రయాణిస్తున్న21 మంది సజీవ దహనం అయ్యారు. ప్రయాణికులలో 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీసి గుర్తించామని జిల్లా కలెక్టర్ సిరి చెప్పారు.కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ నం: 08518-277305కి ఫోన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అయినా రవాణా, అగ్నిమాపకశాఖలు తగు చర్యలు తీసుకోవడం లేదు. కనుక ఇదే ఆఖరిది కాబోదు. మళ్ళీ మళ్ళీఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ముఖ్యమంత్రులు,ప్రధాని, రాష్ట్రపతి తదితరులు సంతాపం తెలుపుతూనే ఉంటారు.
ఏపీఎస్ ఆర్టీసీ, టీజీఎస్ ఆర్టీసీ కూడా అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపిస్తున్నాయి.కానీ వాటిలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కనుక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలోనే ఎక్కువగా ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? అని సంబంధితఅధికారులు ఆలోచింఛి తగు చర్యలు చేపడితే ఇటువంటి విషాదాలు నివారించవచ్చు కదా?
ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాధినేతలు దిగ్బ్రాంతి, సంతాప సందేశాలు,ఎక్స్‌గ్రేషియాలతో సరిపెడుతుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. కానీ వాటితో ఈ సమస్యపరిష్కారం కాదు.
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటల్స్, జిమ్ సెంటర్స్ వంటి ప్రదేశాలలోఅగ్నిప్రమాదాలు నివారించడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. పొగ లేదా మంటల వలనఉష్ణోగ్రతలు పెరిగిన వెంటనే అవి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యి అలారం మోగిస్తూ నీళ్ళువిరజిముత్తాయి. కదిలే బస్సులలో ఇటువంటి పరికరాలు ఏర్పాటు చేయడం కష్టమే కానీఅసాధ్యం కాదు.
ఫైర్, స్మోక్, గ్యాస్ లీక్ సెన్సర్లు, స్మార్ట్ అలర్ట్ నెట్‌వర్క్స్ వంటివి విమానాలలో,అంతరిక్షంలోకి వెళ్ళే వాహక నౌకలలో ఉపయోగిస్తూ ఇటువంటి ఘోర ప్రమాదాలనునివారిస్తున్నాయి. కానీ రోడ్లపై తిరిగే బస్సుల్లో వీటిని అమర్చుకోలేమా?
నేడు ప్రతీదానికి రకరకాల యాప్స్, ఏఐ టూల్స్ వచ్చేస్తున్నప్పుడు, బస్సు ఇంజన్లేదా వేరే చోట మంటలు మొదలైతే వెంటనే పసికట్టి అలారం మోగింఛి, బస్సులను బలవంతంగానిలిపివేసే సిస్టం రూపొందించవచ్చు. అలాగే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు నలువైపులా తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకునే వ్యవస్థ ఏర్పాటుచేయవచ్చు. ఆలోచిస్తే ఇటువంటి అనేక ఉపాయాలు లభిస్తాయి.
రవాణా, అగ్నిమాపక, ఐటి తదితరనిపుణులు కలిసి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం కనుగోవడం అసాధ్యమేమీ కాదు. కానీ ఎవరూ ఎందుకుప్రయత్నించడం లేదు? ప్రతీ అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం కాలిపోతూనేఉంది. కానీ మన వ్యవస్థ మాత్రం చప్పున చల్లారిపోతుంటుంది. ఎందువల్ల?




