ట్వీట్లు చేసినంత లేదమ్మా!

Kushboo Character in Agnyaathavaasi Movieనేడు ప్రేక్ష్జకుల ముందుకు వచ్చిన “అజ్ఞాతవాసి” సినిమాపై ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పలేం గానీ, తెలుగు తెరపై మరోసారి ప్రత్యక్షమైన ఒకప్పటి సెన్సేషన్ ఖుష్బూ మాత్రం భారీ ఆశలనే పెట్టుకున్నారన్న విషయం, ఆమె ట్విట్టర్ ఖాతాను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగు సినిమాలో నటించని ఖుష్బూ, ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ సినిమా కావడంతో కధ వినకుండానే ఒప్పుకున్నానని ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులకు నిజంగానే ఖుష్బూ కధ వినకుండానే చేసిందేమో అన్న భావన కలుగుతోంది.

ADVERTISEMENT

విడుదలకు ముందు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్ ను బట్టి, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నదియా క్యారెక్టర్ రేంజ్ లో ఖుష్బూ పాత్ర ఉంటుందని భావించిన సినీ ప్రేక్షకులకు, ఆ స్థాయిలో లేకపోవడం పెద్దగా పరిగణించాల్సిన అంశం కాకపోయినా, టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ దుమ్మురేపాలని భావించిన ఖుష్బూకు మాత్రం ఇది విచారకరమైన విషయమే. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, ఫస్టాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం చిత్రీకరించిన సీన్స్ ను మినహాయిస్తే… ఈ పాత్ర ద్వారా ఖుష్బూకు వచ్చే ప్రత్యేకమైన గుర్తింపు గానీ, అవకాశాలు గానీ పెద్దగా ఏమీ ఉండదు. అందుకే అంటారు… ట్వీట్లు చేసినంత తేలిక కాదు… ఆచరణలో అమలు చేయడం అని..!

ADVERTISEMENT
Latest Stories