‘ముద్దుగుమ్మ’ నోటి వెంట ‘బూతులు’ వస్తే ‘భరించడం’ కష్టమే!

kxip-coach-sanjay-bangar-was-abused-by-preity-zintaలేలేత అందాలను వెండితెరపై వయ్యారంగా ఒలకబోసే సోయగాల సుందరీమణులు చిలక పలుకులు పలికితే చూడముచ్చటగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతూ ‘బూతులు’ తిడుతుంటే భరించడం కాస్త కష్టమైన విషయమే కదా! అందాల బొమ్మ ప్రీతిజింటా దయ వలన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోచ్ సంజయ్ బంగార్ అలాంటి అనుభూతినే చవిచూసాడంట.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ పది మ్యాచ్ లాడిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు, కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను జారవిడుచుకుంది. ఈ క్రమంలో జట్టు కోచ్ గా ఉన్న సంజయ్ బంగార్ తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించడంలో విఫలమయ్యాడన్న కారణంతో అందరి ముందు తనకు ఇష్టమొచ్చినట్లు ప్రీతీజింటా తిట్టినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ప్రతి మ్యాచ్ లోనూ ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చడమే కాక, రాణిస్తున్న అక్షర్ పటేల్ ను కాకుండా బెహర్దీన్ వంటి ఆటగాళ్ళను ముందుగా పంపడం ప్రీతికి పట్టరాని కోపం తెప్పించాయని, దీంతో ఆమె నోటికి పని చెప్పడంతో, సమాధానం చెప్పలేక బంగార్ వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు పలు మీడియా సంస్థలు కధనాలను ప్రచురించాయి. అయితే ఇదంతా అవాస్తవమని ప్రీతిజింటా ఖండించారు.

ADVERTISEMENT
Latest Stories