2016 నూతన సంవత్సరంలో జనవరి 29వ తేదీన సన్నీ లియోన్ ‘అడల్ట్’ కామెడీ చిత్రం “మస్తీ జాదే” బాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను పంచడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందు మరో “బూతు” కామెడీ సినీ అభిమానుల కోసం సిద్ధమవుతోంది. ఆఫ్తాబ్ శివదాసాని, తుషార్ కపూర్, మండన కరిమి, తర్కల్, క్లాడియాలు నటించిన “క్యా కూల్ హేన్ హమ్ 3” చిత్రం విడుదల కాబోతోంది.
జనవరి 22వ తేదీన వెండితెరను పలకరించనున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏక్తా కపూర్, శోభ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ట్రైలర్ ను చిత్ర యూనిట్ అయితే అధికారికంగా విడుదల చేయలేదని తెలుస్తోంది. అయితే లీక్ ఎఫెక్ట్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నట్లుగా సమాచారం. “క్యా కూల్ హేన్ హమ్” సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ప్రజాదరణకు నోచుకోవడంతో ఈ సినిమా కూడా నవ్వులను పంచుతుందని ఆశిస్తున్నారు. అయితే వారికి ‘డబుల్ మీనింగ్ బొనంజా’ ఇవ్వబోతుందని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది.





