ఆ సర్వేలో నిజమెంత? లగడపాటి మాటల్లోనే!

lagadapati raja gopal!కొన్ని రోజులుగా మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరిట ఒక సర్వే ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆంధ్ర ఆక్టోపస్ గా ప్రఖ్యాతి గాంచిన లగడపాటి సర్వే అంటే చాలా విశ్వాసం ఉంది తెలుగు రాష్ట్రాలలో. దీనిని అదనుగా చేసుకుని కొన్ని వైకాపా అనుకూల మీడియా వర్గాలు ఈ సర్వేను పుట్టించాయి.

“అసలు నేను ఈ మధ్య ఎలాంటి సర్వేలను చేయించలేదు. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక వేళ చేయిస్తే నేనే స్వయంగా మీడియాకు చెబుతా కదా. దయచేసి నా పేరుతో వచ్చే అటువంటి ఫేక్ సర్వేలను ఎవరు నమ్మవద్దు, ” అనే ఆయన ఒక వార్త పత్రికతో అన్నారు.

ADVERTISEMENT

ఆ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 105 సీట్లు, టీడీపీకు 51 సీట్లు, మరియు జనసేనకు 18 సీట్లు రాబోతున్నాయి. వైకాపా అభిమానులతో పాటు ఆంధ్ర బీజేపీ అభిమానులు సైతం ఉత్సాహంగా ఆ సర్వేను అంతటా ప్రచారం చేసారు. కొసమెరుపు ఏమిటంటే ఆ సర్వే బీజేపీకు ఒక్క సీటు రాదని చెప్పిన ఆ పార్టీ అభిమానులు నిరాశపడకపోవడం.

ADVERTISEMENT
Latest Stories