అలా అని లగడపాటి పవన్ కళ్యాణ్ తో చెప్పారట

Lagadapati Rajagopal survey on JanaSena Partyఆ మధ్య వరకు ఏపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మాట మార్చినట్టుగా కనిపిస్తుంది. జనసేన సహకారం లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకాదు అని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక తరహాలో మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని, భాగస్వామ్య ప్రభుత్వం అనివార్యమని వివరించారు.

ADVERTISEMENT

[m9ad]

జనసేనకు అయిదు, ఆరు సీట్లు వస్తాయా? అని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారని, ఎన్ని సీట్లు వచ్చినా తమ మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటుకాబోవని తెలిపారు. 2019 ఎన్నికలలో జనసేన కీలకం కానుందనీ.. వైకాపా, తెదేపాలు జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని లగడపాటి రాజగోపాల్‌ తనతో చెప్పారని వివరించారు.

అయితే ప్రస్తుతానికి రెండు పార్టీలకు తాము సమదూరమని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ అటువంటి సందర్భం వస్తే పవన్ కళ్యాణ్ ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. తెలుగు వారి చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన దాఖలాలు లేవు. మరి జనసేన అటువంటి పరిస్థితి తెస్తుందా?

ADVERTISEMENT
Latest Stories