“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు కౌంటర్ షురూ!

Lakshmi Veeragandhamఎన్టీఆర్ ఇంటి గుమ్మంను లక్ష్మీ పార్వతి దాటుతున్నట్లుగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా ఫస్ట్ లుక్ ను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ ఎటాక్ గా “లక్ష్మీస్ వీరగ్రంధం” అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వర్మ ‘ఫస్ట్ లుక్’కు పూర్తి వ్యత్యాసంగా ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేసారు.

తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విడుదల చేసిన ఈ పోస్టర్లో ఓ మహిళ తన బ్యాక్ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ దర్శనమిస్తోంది. చూడబోతుంటే… వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్”కు పూర్తి విరుద్ధంగా ఈ సినిమా ఉండబోతోందని ఈ పోస్టర్ చెప్పకనే చెప్తోంది. పరోక్షంగా ఇదే విషయాన్ని జగదీశ్వరరెడ్డి కూడా చెప్పారు.

ADVERTISEMENT

ఎన్టీఆర్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారన్న విషయం ప్రజలకు చెప్పడమే ఈ సినిమా ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో మూడు పాటలు హరికధతో పాటు కొన్ని శ్లోకాలు కూడా ఉంటాయని, 2018లో ‘లక్ష్మీస్ వీరగంధం’ సినిమాను తీసుకువస్తామని జగదీశ్వరరెడ్డి స్పష్టం చేసారు. అసలు విషయమేమిటంటే… ఈ పోస్టర్ చూసి ‘ఆ అమ్మాయెవరో గానీ, బ్యాక్ బాగుందని’ స్పందించారు.

ADVERTISEMENT
Latest Stories